News March 16, 2025
NZB: 40 డిగ్రీలకు చేరువలో ఎండ

నిజామాబాద్ నగరంలో ఆదివారం మధ్యాహ్నం ఎండ 40 డిగ్రీలకు చేరువ చేరింది. దానికి తోడు వడ గాలులు కూడా వీస్తున్నాయి. దీనితో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. అత్యవసర పనుల మీద బయటకు వచ్చిన ప్రజలు వేడితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా ఇప్పుడే ఎండలు ఇలా ఉంటే రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందోనని భయపడుతున్నారు. కాగా గత ఏడాది ఇదే రోజు 34 డిగ్రీలుగా ఎండ నమోదైంది.
Similar News
News March 18, 2025
KMR: వైకల్యాన్ని ఓడించి..ఉద్యోగం సాధించి..! అంతే గాక..

ప్రతిభకు అంగవైకల్యం అడ్డురాదని నిరూపించారు జుక్కల్ మండలం మొహ్మదాబాద్ వాసి ముక్తబాయి. పుట్టుకతోనే అంధురాలైనా.. ఆత్మవిశ్వాసం, కృషి, పట్టుదలతో ఇటీవల గ్రూప్- 4కు ఎంపికయ్యారు. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కంచర్ల రెసిడెన్షియల్ పాఠశాలలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అంతే గాక తన పింఛన్ రద్దు చేయాలని కోరుతూ ఎంపీడీవోకు వినతి పత్రం అందించి ఆదర్శంగా నిలిచారు.
News March 18, 2025
బాసర గోదావరిలో దూకిన మహిళ.. కాపాడిన స్థానికులు

బాసర గోదావరి నదిలో దూకి నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం అభంగపట్నం గ్రామానికి చెందిన సత్తేపల్లి లక్ష్మి ఆత్మహత్యకు ప్రయత్నించింది. అటుగా వెళుతున్న స్థానికులు చెన్నాగౌడ్, సాజిత్, ముజ్జు గమనించి ఆ మహిళలను గోదావరినదిలో నుంచి బయటకు తీసి ప్రాణాలను కాపాడారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
News March 18, 2025
నాగన్ పల్లి పసుపు వాగులో గుర్తుతెలియని వ్యక్తి శవం

నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం నాగన్ పల్లి శివారులో గల పసుపు వాగులో సుమారు 40 నుంచి 50 ఏళ్ల వయసు గల మగ వ్యక్తి శవం లభ్యమైనట్టు పోలీసులు తెలిపారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు బోధన్ రూరల్ ఎస్సై మచ్చందర్ రెడ్డి వెల్లడించారు. మృతుడిని ఎవరైనా గుర్తించినట్లయితే బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ కోరారు.