News March 6, 2025
NZB: 420 మంది విద్యార్థుల గైర్హాజరు

నిజామాబాద్ జిల్లాలో గురువారం నిర్వహించిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర పరీక్షలకు 420 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి (DIEO) రవి కుమార్ తెలిపారు. జిల్లాలో మొత్తం 16,343 మంది విద్యార్థులకు 15,923 మంది పరీక్షలకు (97.4 శాతం) హాజరయ్యారని తెలిపారు. ఖిల్లా ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల బీ సెంటర్‌లో ఓ విద్యార్థి చీటీలు రాస్తుండగా పట్టుకున్నారన్నారు.
Similar News
News March 22, 2025
NZB: పదో తరగతి పరీక్షా కేంద్రాలను పరిశీలించిన సీపీ

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరుగుతున్న పదో తరగతి పరీక్ష కేంద్రాలను పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పరిశీలించారు. పరీక్ష నిర్వహిస్తున్న అధికారులతో ఆయన మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ కూడా లోపాలు ఉండకుండా పర్యవేక్షణ చేయాలని సూచించారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ఠ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
News March 22, 2025
NZB: బెట్టింగ్ మాఫియాను ఎదుర్కొవడానికి సన్నద్ధం: సీపీ

బెట్టింగ్ మాఫియాను ఎదుర్కొవడానికి పోలీస్ శాఖ పూర్తిగా కట్టుబడి ఉందని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. ప్రజలు బెట్టింగ్ యాప్‌లతో జాగ్రత్తగా ఉండాలన్నారు. బెట్టింగ్ యాప్‌లు చిన్నపాటి వినోదం కాదని గుర్తించాలన్నారు. సోషల్ మీడియాలో ఎవరూ ఈ యాప్‌లను ప్రమోట్ చేస్తున్నారు. ఎవరు లింక్స్ షేర్ చేస్తున్నారు అనే అంశంపై తాము సైబర్ మానిటరింగ్ చేస్తున్నామన్నారు.
News March 22, 2025
నిజామాబాద్ జిల్లాకు రేపు ముఖ్యమంత్రి రాక..!

నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం నర్సింగ్‌పల్లిలోని ఇందూరు తిరుమలలో వార్షిక బ్రహోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం జరిగే స్వామివారి కల్యాణానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారని ఆలయ ప్రతినిధులు తెలిపారు. ఈ విషయమై భద్రతా ఏర్పాట్ల గురించి అధికారులు, పోలీసులు చర్చిస్తున్నట్లు సమాచారం.