News August 17, 2025
NZB: 51.50 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం

నిజామాబాద్ జిల్లాలో 2025-26లో 51.50 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటివరకు 27 లక్షల మొక్కలు నాటారు. జిల్లాలో 2,14,056 ఎకరాల అటవీ విస్తీర్ణం ఉంది, ఇది జిల్లా మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో 20.86 శాతం. జాతీయ రహదారులు ఎన్‌హెచ్-44, ఎన్‌హెచ్-63 వెంబడి 185 కిలోమీటర్ల పొడవున అవెన్యూ ప్లాంటేషన్ చేపడుతున్నట్లు అటవీశాఖ నివేదిక పేర్కొంది.
Similar News
News September 4, 2025
నిజామాబాద్: ఒక రోజు మద్యం దుకాణాల బంద్

వినాయక నిమజ్జనం సందర్భంగా నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలోని అన్ని వైన్స్ షాపులు, కల్లు దుకాణాలు, బార్లు, క్లబ్బులు బంద్ చేయాలని సీపీ సాయి చైతన్య ఆదేశాలు జారీ చేశారు. వినాయక నిమజ్జనం సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా CP నిర్ణయం తీసుకున్నారు. గణపతి నిమజ్జనం సందర్భంగా జిల్లాలో గురువారం ఉదయం
6 గంటల నుంచి 5వ తేదీ ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలు బంద్ పాటించాలన్నారు.
News September 4, 2025
నిజామాబాద్: 301 మందికి జీపీవో నియామక పత్రాలు

జిల్లా నుంచి ఎంపికైన 301 మంది గ్రామ పంచాయతీ అధికారులకు (జీపీవో) ఈ నెల 5న ముఖ్యమంత్రి నియామక పత్రాలు అందజేయనున్నారు. వారిని ప్రత్యేక బస్సుల్లో హైదరాబాద్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేశామని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. నిజామాబాద్ డివిజన్ వారు పాత కలెక్టరేట్ మైదానం నుంచి, ఆర్మూర్ డివిజన్ వారు ఆర్మూర్ తహశీల్దార్ కార్యాలయం, బోధన్ డివిజన్ వారు బోధన్ తహశీల్దార్ కార్యాలయం నుంచి బయలుదేరుతారన్నారు.
News September 4, 2025
NZB: PHD ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

2025-26 విద్యా సంవత్సరానికి PHD ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఉర్దూ, బిజినెస్ మేనేజ్‌మెంట్, కామర్స్, అప్లైడ్ స్టాటిస్టిక్స్, బాటని, బయోటెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, జియో ఇన్ఫర్మాటిక్స్, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫార్మాసూటికల్ కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఎకనామిక్స్, మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం, సోషల్ వర్క్, లా విభాగాల్లో ఖాళీల ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని రిజిస్ట్రార్ ప్రొ.యాదగిరి తెలిపారు.