News January 11, 2025
NZB: 9 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

నిజామాబాద్లో ఇంటింటికీ తిరిగి రేషన్ బియ్యాన్ని సేకరించి 1వ టౌన్ పరిధిలోని PDS మాఫియా గోదాంలకు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి జరిగింది. నిజామాబాద్ నగరంలోని గౌతం నగర్కు చెందిన కన్ రాజ్ బాలరాజ్ తన ఆటోలో 9 క్వింటాళ్ల రేషన్ బియ్యం తరలిస్తున్న సమయంలో పోలీసులు పట్టుకున్నారు. PDS మాఫీయా నిర్వహకులకు అందజేసేందుకు వెళ్తున్నప్పుడు పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News November 27, 2025
ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలి: NZB కలెక్టర్

గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 3 విడతల్లో జరగనున్న పోలింగ్లో ప్రతి ఓటరు పాలుపంచుకుని స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని నిజామాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. గురువారం ఆయన కలెక్టరేట్లో మీడియాతో మాట్లాడారు. ప్రజలు ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేలా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు.
News November 27, 2025
NZB: జిల్లాలో తొలి రోజు నామినేషన్లు ఎన్ని అంటే?

నిజామాబాద్ జిల్లాలోని బోధన్, చందూర్, కోటగిరి, మోస్రా, పొతంగల్, రెంజల్, రుద్రూర్, సాలుర, ఎడపల్లి, నవీపేట మండలాల్లో మొదటి విడతలో GP ఎన్నికలు జరగనున్నాయి. గురువారం సాయంత్రం వరకు దాఖలైన నామినేషన్లు వివరాలు ఇలా ఉన్నాయి. 184 సర్పంచి స్థానాలకు సంబంధించి 140 నామినేషన్లు, 1,642 వార్డు స్థానాలకు సంబంధించి 96 నామినేషన్లు దాఖలు అయినట్లు అధికారులు వెల్లడించారు.
News November 27, 2025
NZB: 34 మందికి రూ.3.35 లక్షల జరిమానా

నిజామాబాద్ కమీషనరేట్ పరిధిలో మద్యం తాగి వాహనాలు నడిపిన 34 మందిని పోలీసులు పట్టుకున్నారు. వారిని గురువారం జిల్లా మార్నింగ్ కోర్టులో సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ నూర్జహాన్ ఎదుట హాజరుపరిచారు. వారికి రూ.3.35 లక్షల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు. అంతకు ముందు వారికి సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులు కౌన్సెలింగ్ ఇచ్చారు.


