News January 11, 2025
NZB: 9 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
నిజామాబాద్‌లో ఇంటింటికీ తిరిగి రేషన్ బియ్యాన్ని సేకరించి 1వ టౌన్ పరిధిలోని PDS మాఫియా గోదాంలకు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి జరిగింది. నిజామాబాద్ నగరంలోని గౌతం నగర్‌కు చెందిన కన్ రాజ్ బాలరాజ్ తన ఆటోలో 9 క్వింటాళ్ల రేషన్ బియ్యం తరలిస్తున్న సమయంలో పోలీసులు పట్టుకున్నారు. PDS మాఫీయా నిర్వహకులకు అందజేసేందుకు వెళ్తున్నప్పుడు పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News January 11, 2025
NZB: అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం
గ్రామ, వార్డు సభల నిర్వహణకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు దిశానిర్దేశం చేశారు. శనివారం జూమ్ మీటింగ్ ద్వారా ఆయన అధికారులతో మాట్లాడారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలకు సంబంధించి ఈ నెల 21 నుంచి 24 వరకు గ్రామ, వార్డు సభలను పక్కాగా నిర్వహించాలని సూచించారు.
News January 11, 2025
NZB: ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ఇన్‌ఛార్జ్ CP
నిజామాబాద్ జిల్లా ప్రజలకు ఇన్‌ఛార్జ్ సీపీ సింధూ శర్మ శనివారం ఒక ప్రకటనలో సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఇంటిల్లిపాది అంగరంగ వైభవంగా మూడు రోజుల పాటు భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను జరుపుకోవడం మన అందరి సాంప్రదాయమన్నారు. ప్రజలందరు వారి కుటుంబ సభ్యులతో నిండు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో జీవనము గడపాలని ఆకాంక్షించారు. అలాగే ప్రజలు, పోలీస్ సిబ్బంది స్నేహపూర్వకంగా సోదరభావంతో మెలగాలని కోరుకున్నారు.
News January 11, 2025
NZB: నిలకడ స్థాయికి చేరుకున్న ఉమ్మడి జిల్లా ఉష్ణోగ్రతలు
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చలి తీవ్రత నిలకడ స్థాయికి చేరుకుంది. శనివారం కామారెడ్డి జిల్లాలో అత్యల్పంగా డోంగ్లి 13.1, జుక్కల్ 13.5, మేనూర్ 13.9, సోమూర్ 14.3, వేల్పుగొండ 14.6 ఉష్ణోగ్రతల నమోదు కాగా నిజామాబాద్ జిల్లాలో అత్యల్పంగా నిజామాబాద్ సౌత్ 15.3, కోటగిరి 15.4, రుద్రూర్ 15.5,ఎర్గట్ల,సాలూర,మెండోరా,వలిపూర్ లలో 15.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.