News August 19, 2025

NZB: 967 చెరువులు.. 4.5 కోట్ల చేప పిల్లలు

image

మత్స్య కార్మిక కుటుంబాల ఉపాధిని మెరుగుపర్చి, వారిని ఆర్థికంగా మరింత బలోపేతం చేసేందుకు నాణ్యమైన చేప పిల్లల పెంపకంపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని NZB కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం ఆయన మత్స్యశాఖ పని తీరుపై సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాది 967 చెరువుల్లో 4.5 కోట్ల చేప పిల్లలను వదలాలని నిర్ధేశించిన లక్ష్యం మేరకు చేప పిల్లల పిల్లల పెంపకానికి చొరవ చూపాలన్నారు.

Similar News

News August 23, 2025

రుద్రూర్‌లో బాలుడి అదృశ్యం

image

రుద్రూర్ గ్రామానికి చెందిన బాలుడు జ్యోతే కేదార్ (14) గురువారం రాత్రి నుంచి కనిపించడం లేదని తల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు ఎస్ఐ సాయన్న ఈరోజు తెలిపారు. స్కూల్ వెళ్లకుండా బోధన్ టౌన్‌కు వెళ్లినందుకు తల్లిదండ్రులు మందలించారన్నారు. రాత్రి కేదార్ ఎవరికి చెప్పకుండా ఇంట్లోంచి వెళ్లిపోయాడని. బంధువుల వద్ద గాలించినప్పటికీ ఆచూకీ లభించలేదని తల్లి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశామన్నారు.

News August 22, 2025

నిజామాబాద్: పోలీస్ పర్సనల్ అధికారుల శిక్షణ

image

పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న వారికి PSO శిక్షణ కార్యక్రమాన్ని పోలీస్ కమాండ్ కంట్రోల్ హాల్‌లో సీపీ సాయి చైతన్య శుక్రవారం ప్రారంభించారు. సీపీ మాట్లాడుతూ.. VIPల భద్రతలో సేవలు అందించే PSOల పాత్ర అత్యంత ముఖ్యమైందన్నారు. నైపుణ్యాలను మెరుగుపరచడానికి, అత్యాధునిక విధానాలపై అవగాహన కల్పించడానికి, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలపై శిక్షణ ఇచ్చామన్నారు.

News August 22, 2025

నిజామాబాద్: గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే ధ్యేయం: ఎమ్మెల్యే

image

గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా పనుల జాతర కార్యక్రమాన్ని చేపట్టిందని రూరల్ ఎమ్మెల్యే డా.భూపతి రెడ్డి వెల్లడించారు. శుక్రవారం నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని పాల్ద గ్రామంలో పనుల జాతరలో రూ.12 లక్షల వ్యయంతో నూతన అంగన్‌వాడీ భవన నిర్మాణానికి శుక్రవారం కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, ఇతర అధికారులతో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.