News October 25, 2024
NZB: ‘ATCలలో అడ్మిషన్ల ప్రక్రియను వేగవంతం చేయాలి’

మెరుగైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ఊతమందించే అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ (ATC)లలో అడ్మిషన్ల ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర కార్మిక, ఉపాధికల్పన, శిక్షణ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి సంజయ్ కుమార్ సూచించారు. శుక్రవారం ఆయన నిజామాబాద్ జిల్లా కలెక్టర్‌తో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. ఏటీసీ భవనాల నిర్మాణ పనులు వేగవంతంగా జరిగేలా చూడాలన్నారు.
Similar News
News November 1, 2025
NZB: కలెక్టర్, సీపీతో ఎస్టీ, ఎస్సీ కమిషన్ ఛైర్మన్ భేటీ

రాష్ట్ర షెడ్యూలు కులాలు, షెడ్యూలు తెగల కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య శనివారం NZB కలెక్టరేట్‌లో కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, ఇతర అధికారులతో భేటీ అయ్యారు. పోలీసు, రెవెన్యూ అధికారులు, ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి, సంక్షేమ శాఖల అధికారులు, కుల సంఘాల నాయకులతో అట్రాసిటీ కేసుల్లో పురోగతి, ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. సమస్యలపై బాధితుల నుంచి విజ్ఞాప్తులు స్వీకరించారు.
News November 1, 2025
UPDATE: ఘటనా స్థలాన్ని పరిశీలించిన NZB CP

నవీపేట్ మండలం ఫకీరాబాద్ -మిట్టాపల్లి రహదారిలో ఓ మహిళను <<18166463>>వివస్త్రగా చేసి దారుణంగా హతమార్చిన సంగతి తెలిసిందే.<<>> విషయం తెలుసుకున్న నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య శనివారం ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. డాగ్ స్క్వాడ్‌తో పరిశీలన చేయించారు. నవీపేట్ మండలంలో మహిళల హత్యలు వెలుగు చూస్తుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. వారం వ్యవధిలో ఇది రెండవ హత్య కావడం గమనార్హం.
News November 1, 2025
వర్ని: బాలికపై లైంగిక దాడి.. యువకుడిపై పోక్సో కేసు

వర్నిమండలంలోని ఓ గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలికపై గణేష్ (24)అనే యువకుడు పలుమార్లు లైంగిక దాడికి పాల్పడగా బాలిక గర్భం దాల్చిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. రెండు రోజుల క్రితం ఆమెకు కడుపునొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు పరీక్షించి బాలిక గర్భం దాల్చినట్లు నిర్ధారించారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు వర్ని SI మహేష్ తెలిపారు.


