News February 24, 2025
NZB: BRSకు పోటీ చేసేందుకు అభ్యర్థి లేడు: CM

ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీఆర్ఎస్కు అభ్యర్థి దొరకలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. సోమవారం నిజామాబాద్లో నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలంటూ కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. కనీసం ఎన్నికల్లో పోటీకి అభ్యర్థి లేని ఆ పార్టీ తమ ప్రభుత్వాన్ని ఏ విధంగా పడగొడుతుందో ఆలోచించుకోవాలన్నారు.
Similar News
News February 25, 2025
నిజామాబాద్: మిర్చికి మాత్రం రూ.25 వేల మద్దతు ధర సాధించాలి: కవిత

‘ముఖ్యమంత్రి ఢిల్లీకి పోతారా.. ప్రధాని మోదీ కాళ్లు పట్టుకుంటారా.. ఏం చేస్తారో మాకు సంబంధం లేదు. కానీ కచ్చితంగా రూ.25 వేల మద్దతు ధర సాధించాల్సిందే’ అని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో కూడా మిర్చి ధరలు తగ్గగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులను కలిసి లొల్లి లొల్లి చేశారని గుర్తు చేశారు.
News February 25, 2025
NZB: ‘అధునాతన సదుపాయాలతో రెసిడెన్షియల్ పాఠశాలలు’

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో అధునాతన వసతి, సదుపాయాలతో సమీకృత రెసిడెన్షియల్ పాఠశాలలను అందుబాటులోకి తేనున్నామని రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితారాణ వెల్లడించారు. సోమవారం ఆమె రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి కె.రామకృష్ణారావుతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణాలు, వసతుల కల్పన కోసం చేపట్టాల్సిన చర్యలపై సూచనలు చేశారు.
News February 25, 2025
నిజామాబాద్: వారోత్సవాలను విజయవంతం చేయాలి: కలెక్టర్

రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈనెల 24 నుంచి 28 వరకు నిర్వహించే ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలను విజయవంతం చేయాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పిలుపునిచ్చారు. వారోత్సవాలను పురస్కరించుకుని లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో రూపొందించిన గోడప్రతులను కలెక్టరేట్లో సోమవారం కలెక్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో సాయాగౌడ్, నాబార్డు డీడీఎం ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.