News March 6, 2025
NZB: BRS, కాంగ్రెస్కు ప్రజల చరమగీతం: MP

BRS, కాంగ్రెస్కు ప్రజలు చరమగీతం పాడారని నిజామాబాద్ BJP ఎంపీ ధర్మపురి అరవింద్ పేర్కొన్నారు. MLC ఎన్నికల్లో BJP గెలుపు నేపథ్యంలో ఆయన మాట్లాడారు. వచ్చే స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల్లో BJP విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 2028లో తెలంగాణలో BJPదే అధికారమని తెలిపారు. ఇక అన్ని ఎన్నికల్లోనూ స్వీప్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తామని పేర్కొన్నారు. MP వ్యాఖ్యలపై మీ కామెంట్?
Similar News
News November 25, 2025
కామారెడ్డి: రోడ్డు ప్రమాదంలో నవ వధువు మృతి

సిద్దిపేట జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో KMR(D)కు చెందిన నవవధువు మృతి చెందింది. పోలీసుల వివరాల ప్రకారం..బిచ్కుందకు చెందిన సాయికిరణ్కు 4 నెలల క్రితం SDPTకు చెందిన ప్రణతితో పెళ్లైంది. వీరిద్దరూ HYDలో ఉద్యోగం చేస్తున్నారు. SDPTలో ఓ ఫంక్షన్కు హజరైన దంపతులు నిన్న బైకుపై HYD వెళ్తుండగా పెద్దచెప్యాల వద్ద ట్రాక్టర్ వెనక నుంచి వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రణతి మృతి చెందగా, సాయికిరణ్ గాయపడ్డాడు.
News November 25, 2025
సూర్యాపేట: నామినేషన్ వేస్తే ఏకగ్రీవమే!

త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో నూతనకల్ మండలం పెదనెమిల జీపీలో ఓ విచిత్ర పరిస్థితి నెలకొంది. పెదనెమిల జీపీలోని 1వ వార్డు ఎస్టీ జనరల్కు రిజర్వ్ అయింది. అయితే గ్రామంలో ఎస్టీ వర్గానికి చెందిన ఓటరు ఒక్కరే ఉండటం విశేషం. నామినేషన్ వేసే ప్రక్రియ పూర్తయితే, వార్డు మెంబర్ ఏకగ్రీవం కానుంది.
News November 25, 2025
తిరుపతి మీదుగా బుల్లెట్ ట్రైన్

హైదరాబాద్-చెన్నై బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు ఫైల్స్ వేగంగా ముందుకు కదులుతున్నాయి. సంబంధిత అలైన్మెంట్ను తమిళనాడు ప్రభుత్వానికి SCR పంపింది. ముందుగా గూడూరు స్టాఫింగ్ అనుకునప్పటికీ తిరుపతిలో స్టాఫింగ్ ఉండేలా ప్లాన్ చేయాలని TN ప్రభుత్వం కోరింది. త్వరలోనే ఈ DPR పూర్తి కానుంది. ఈ రెండు నగరాల మధ్య ప్రయాణం 12గంటలుండగా బుల్లెట్ ట్రైన్లో కేవలం 2.20 గంటల్లోనే చేరుకోవచ్చు. ఈ మార్గంలో 11.6KM సొరంగం ఉంటుంది.


