News March 6, 2025

NZB: BRS, కాంగ్రెస్‌కు ప్రజల చరమగీతం: MP

image

BRS, కాంగ్రెస్‌కు ప్రజలు చరమగీతం పాడారని నిజామాబాద్ BJP ఎంపీ ధర్మపురి అరవింద్ పేర్కొన్నారు. MLC ఎన్నికల్లో BJP గెలుపు నేపథ్యంలో ఆయన మాట్లాడారు. వచ్చే స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల్లో BJP విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 2028లో తెలంగాణలో BJPదే అధికారమని తెలిపారు. ఇక అన్ని ఎన్నికల్లోనూ స్వీప్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తామని పేర్కొన్నారు. MP వ్యాఖ్యలపై మీ కామెంట్?

Similar News

News April 14, 2026

దేశంలో 16 మంది బీజేపీ సీఎంలు.. లిస్ట్ ఇదే

image

⋆ అస్సాం-హిమంత బిశ్వ శర్మ, అరుణాచల్‌ప్రదేశ్-పెమా ఖండూ
⋆ ఛత్తీస్‌గఢ్-విష్ణుదేవసాయ్, ఢిల్లీ-రేఖా గుప్తా
⋆ గోవా-ప్రమోద్ సావంత్, గుజరాత్-భూపేంద్ర పటేల్
⋆ హరియాణా-నాయబ్ సింగ్ సైనీ, UP-యోగి ఆదిత్యనాథ్
⋆ MP-మోహన్ యాదవ్, మహారాష్ట్ర-దేవేంద్ర ఫడణవీస్
⋆ మణిపుర్-యుమ్నాం ఖేమ్‌చంద్ సింగ్, ఉత్తరాఖండ్-పుష్కర్ సింగ్ ధామి
⋆ ఒడిశా-మోహన్ చరణ్ మాఝీ, త్రిపుర-మాణిక్ సాహా
⋆ రాజస్థాన్-భజన్‌లాల్ శర్మ, బిహార్-సామ్రాట్ చౌదరి

News April 14, 2026

HYDలో భారీ మోసం.. ఇద్దరు అరెస్ట్

image

నగరంలో విదేశీ ఉద్యోగాల పేరుతో జరుగుతున్న భారీ మోసాన్ని జూబ్లీహిల్స్ పోలీసులు బట్టబయలు చేశారు. యూరప్ దేశాల్లో ఉద్యోగాలంటూ ఒక్కో వ్యక్తి నుంచి రూ.4 నుంచి 5 లక్షలు వసూలు చేస్తున్న ‘ట్రివియల్ చాప్టర్’ సంస్థకు చెందిన ఇద్దరిని అరెస్ట్ చేశారు. సోషల్ మీడియా ప్రకటనలు, నకిలీ ఆఫర్ లెటర్లతో ఈ ముఠా మోసాలకు పాల్పడుతోంది. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

News April 14, 2026

ఆలేరు: పాన్ మసాలా చోరీ కేసును ఛేదించిన పోలీసులు

image

ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు తరలుతున్న రూ.కోటి విలువైన ‘ఓ పాన్ మసాలా’ లోడుతో అదృశ్యమైన కంటైనర్ కేసును ఆలేరు పోలీసులు ఛేదించారు. ఏప్రిల్ మొదటి వారంలో కంటైనర్ అదృశ్యంపై ఢిల్లీకి చెందిన వినోద్ ఉపాధ్యాయ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని సీఐ యాలాద్రి తెలిపారు. సాంకేతిక ఆధారాలతో వేగంగా దర్యాప్తు చేసి నిందితులను పట్టుకున్నట్లు పేర్కొన్నారు.