News March 17, 2024

NZB: నలుగురు కాంగ్రెస్ నాయకులకు కార్పొరేషన్ పదవులు

image

కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించిన వివిధ కార్పొరేషన్ పదవుల్లో NZB జిల్లా బాల్కొండ నియోజకవర్గం నుంచి ముగ్గురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పదవులు పొందారు. అనిల్ ఈరవత్రి (మినరల్ డెవలప్‌మెంట్), మానాల మోహన్ రెడ్డి(కో ఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్), అన్వేశ్ రెడ్డి(సీడ్స్ డెవలప్‌మెంట్). వీరితో పాటు కామారెడ్డి జిల్లా నుంచి కాసుల బాలరాజు (ఆర్గో ఇండస్ట్రీస్) లభించింది.

Similar News

News July 5, 2025

NZB: 9 మంది హెడ్ కానిస్టేబుళ్లకు ASIలుగా పదోన్నతి

image

బాసర జోన్-2లో పని చేస్తున్న 9 మంది హెడ్ కానిస్టేబుళ్లకు ASIలుగా పదోన్నతి లభించింది. వీరిని నిజామాబాద్ కమిషనరేట్‌కు అలాట్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రియాజుద్దీన్, జక్రయ్య, పరమేశ్వర్, వసంతరావు, అరుణ కుమారి, అనురాధ, రమనేశ్వరి, ముంతాజ్ బేగం, సతీశ్ కుమార్ ASIలుగా పదోన్నతి పొందారు.

News July 5, 2025

డొంకేశ్వర్ మండలం నుంచి 41 మంది IIITకి ఎంపిక

image

డొంకేశ్వర్ మండలం నుంచి మొత్తం 40 మంది విద్యార్థులు IIITకి ఎంపికయ్యారు. ఇందులో డొంకేశ్వర్ ZPHSకు చెందిన 26 మంది విద్యార్థులు ఉండటం విశేషం. 19 మంది అమ్మాయిలు, ఏడుగురు అబ్బాయిలు ఉన్నారు. తొండాకూర్ ZPHS నుంచి 9, నికాల్పూర్ ZPHS ఐదుగురు, గాదేపల్లి ప్రభుత్వ పాఠశాల నుంచి ఒకరు సెలెక్ట్ అయ్యారు. డొంకేశ్వర్ పాఠశాల హెచ్ఎం సురేశ్, తొండాకూర్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లింగారెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

News July 5, 2025

NZB: వరల్డ్ పోలీస్ గేమ్స్‌లో బాబాకు మరో బ్రాంజ్ మెడల్

image

వరల్డ్ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్‌లో నిజామాబాద్ జిల్లాకు చెందిన మహమ్మద్ బాబా మరో బ్రాంజ్ మెడల్ సాధించాడు. అమెరికాలోని అలబామాలో జరుగుతున్న వరల్డ్ పోలీస్ ఆండ్ ఫైర్ గేమ్స్‌లో భాగంగా 35 ఏళ్ల కేటగిరిలో బాబా 110 మీటర్ల హర్డిల్స్‌లో అద్భుత ప్రతిభను ప్రదర్శించాడు. 3వ స్థానంలో నిలిచి బ్రాంజ్ మెడల్ అందుకున్నాడు. అక్కడి భారతీయ అభిమానులు ఆయనను అభినందించారు.