News June 11, 2024
NZB: CP కార్యాలయంలో మహిళా ఆత్మహత్యాయత్నం

నిజామాబాద్ CP ఆఫీస్‌లో ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. మాక్లూర్ మండలం దాస్‌నగర్‌కు చెందిన నర్సమ్మ పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే సిబ్బంది ఆమెను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నర్సమ్మకు చెందిన 20 గజాల స్థలాన్ని కొందరు కబ్జా చేశారు. అధికారులు పట్టించుకోకపోవడంతో మనస్తాపం చెందిన ఆమె ఆత్మహత్యయత్నానికి పాల్పడినట్లు ఆమె కూతురు గంగాలక్ష్మి తెలిపింది.
Similar News
News March 28, 2025
NZB: స్వయం సహాయక సంఘాలకు ప్రమాద బీమా

స్వయం సహాయక సంఘాల సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం రుణ బీమా, ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఈ మేరకు గురువారం సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి లోకేశ్ కుమార్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ జిల్లా అధికారులకు పలు సూచనలు చేశారు. బీమా సౌకర్యం వివరాలను స్వయం సహాయక సంఘాల సభ్యులందరికీ తెలియజేయాలన్నారు.
News March 28, 2025
NZB: TGRJC CETకు దరఖాస్తుల ఆహ్వానం

నిజామాబాద్ జిల్లాలోని గురుకుల కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరేందుకు 10వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని TGRJC CET నిజామాబాద్ జిల్లా కోఆర్డినేటర్ గంగా శంకర్ తెలిపారు. మార్చి 24 నుంచి ఏప్రిల్ 23 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. మే 25న జిల్లా కేంద్రంలో ప్రవేశ పరీక్ష ఉంటుందని తెలిపారు.
News March 27, 2025
కామారెడ్డి: చెరువులో నీట మునిగి బాలుడు మృతి

HYD గచ్చిబౌలి పరిధిలో విషాదం చోటుచేసుకుంది. కామారెడ్డి జిల్లా డోంగ్లి మండలానికి చెందిన కార్తీక్ (14) చెరువులో నీట మునిగి మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. కుర్ల గ్రామానికి చెందిన మల్కయ్య-బాలమణి దంపతులు నానక్‌రాంగూడలో పనిచేస్తున్నారు. కాగా కొడుకు కార్తీక్ సోమవారం కనిపించకుండా పోయాడు. మంగళవారం తల్లిదండ్రులు PSలో ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేయగా బుధవారం విప్రో లేక్‌లో శవమై తేలాడు.