News August 24, 2024
NZB: DSP రీజినల్ ఇన్‌ఛార్జ్‌గా సుమన్‌కు బాధ్యతలు

ధర్మసమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా, నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల రీజినల్ ఇన్‌ఛార్జ్‌గా కండెల సుమన్‌ను నియమిస్తూ ధర్మ సమాజ్ పార్టీ అధినేత డాక్టర్ విశారదన్ మహారాజ్ లేఖలో వెల్లడించారు. పార్టీ రాష్ట్ర కమిటీ ఆదేశానుసారం రీజియన్‌లో పార్టీ నిర్మాణ కార్యక్రమాలను బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని ఆయన సూచించారు. ఇంతటి బాధ్యతలు అప్పగించినందుకు విశారధన్ మహారాజ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News November 23, 2025
NZB: పల్లెల్లో టెన్షన్ టెన్షన్.. రిజర్వేషన్లు మారితే..!

గ్రామ పంచాయితీ రిజర్వేషన్లు నేడు ఖరారు కానున్నాయి. మళ్లీ పల్లెల్లో సందడి, టెన్షన్ కనిపిస్తోంది. 2011 జనాభా లెక్కలతో సర్పంచి స్థానాలకు ఆర్డీవోలు, కులగణనతో వార్డులకు ఎంపీడీఓలు రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. 50 శాతం రిజర్వేషన్లు మించకుండా BC, SC, STలకు కేటాయిస్తారు. ఆపై మహిళలకు 50 శాతం స్థానాలు లక్కీ డ్రా తీస్తారు. రిజర్వేషన్లు మారితే లీడర్లు తమ భార్యలు, తల్లులను బరిలోకి దింపే ప్లాన్ చేస్తున్నారు.
News November 23, 2025
SRSPకి భారీగా తగ్గిపోయిన ఇన్ ఫ్లో

SRSPలోకి ఇన్ ఫ్లో భారీగా తగ్గిపోయింది. గడిచిన 24 గంటల్లో SRSPలోకి ఎగువ ప్రాంతాల నుంచి 1,338 క్యూసెక్కుల ఇన్ ఫ్లో రాగ అంతే మొత్తం నీటిని దిగువకు వదిలినట్లు ప్రాజెక్టు అధికారులు ఆదివారం తెలిపారు. సరస్వతీ కెనాల్‌కు 650, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల నీరు వదిలామన్నారు. కాగా ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో 80.501 TMCల నీరు నిల్వ ఉందన్నారు.
News November 23, 2025
NZB: సాధారణ కార్యకర్త నుంచి DCC అధ్యక్షుడిగా..!

నిజామాబాద్ DCC అధ్యక్షుడిగా నగేష్ రెడ్డి నియమితులయ్యారు. మోపాల్(M) ముల్లంగికి చెందిన చెందిన ఆయన 1986లో TDPనుంచి సర్పంచ్‌గా పని చేశారు. 1995లో కాంగ్రెస్‌లో చేరి 2004వరకు మోపాల్ సింగిల్ విండో ఛైర్మన్‌గా, 2014 వరకు 5 సార్లు మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా చేశారు. కాంగ్రెస్ పార్టీలో సాధారణ కార్యకర్త నుంచి అంచలంచెలుగా ఎదిగారు. 2023లో MLA టికెట్ ఆశించగా పార్టీ భూపతి రెడ్డికి టికెట్ ఖరారు చేసింది.


