News February 22, 2025
NZB: ‘EC మార్గదర్శకాల ప్రకారం చర్యలు తీసుకోవాలి’

EC మార్గదర్శకాల ప్రకారం ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నిర్వహణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు. శుక్రవారం సంబంధిత ఎన్నికల అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో సందర్శించి సదుపాయాలను సరి చూసుకోవాలన్నారు. ఓటింగ్ పూర్తయిన అనంతరం పోలింగ్ కేంద్రాల నుంచి బ్యాలెట్ బాక్సులను కట్టుదిట్టమైన భద్రత నడుమ తరలించాలన్నారు.
Similar News
News March 23, 2025
NZB: చెల్లి మృతి.. బాధలోనూ పరీక్ష రాసిన అన్న

ఓ వైపు చెల్లి మరణం.. మరో వైపు ‘పది’ పరీక్షలు. ఆ పుట్టెడు దుఃఖంలో పరీక్ష రాశారు నిజామాబాద్‌కు చెందిన లక్ష్మీ గణ సాయి. ఆదర్శనగర్‌లోని పానుగంటి సాయిలు-వినోద దంపతులకు కుమారుడు లక్ష్మీ గణ సాయి, కుమార్తె పల్లవి సంతానం. అయితే పల్లవి 2 నెలల క్రితం క్యాన్సర్ బారినపడి శుక్రవారం రాత్రి మరణించగా, ఆ వార్త దిగమింగుకొని అన్న శనివారం పదో తరగతి పరీక్ష రాశారు. దుఃఖంలోనూ పరీక్ష రాసిన అన్న గ్రేట్ కదా..!
News March 23, 2025
NZB: ఆరుగురు మృతి.. 17 మందిపై కేసులు

నిజామాబాద్ జిల్లాలో శనివారం తీవ్ర విషాదం నింపింది. ఒక్కరోజే వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురు మృతి చెందగా, అలాగే పలు ఘటనల్లో 17 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. చేపల వేటకు వెళ్లి, వాహనం ఢీకొని, గొడవ పడటవంతో హత్య, జ్వరంతో యువకుడు, చెట్టు పైనుంచి పడి, నిజాంసాగర్ కాలువ వద్ద ఒకరు మృతిచెందినట్లు పోలీసులు ధ్రువీకరించారు. అలాగే జూదం, న్యూసెన్స్ ఘటనల్లో 17 మందిపై కేసు నమోదు చేసినట్లు వివరించారు.
News March 23, 2025
నిజామాబాదులో వ్యక్తి దారుణ హత్య

వేల్పూర్ మండలం పచ్చలనడ్కడలో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. మృతుడు మహారాష్ట్రకు చెందిన శంకర్‌గా గుర్తించారు. మహారాష్ట్రకు చెందిన శంకర్, బాలాజీ ఇద్దరు నెల రోజుల నుంచి గ్రామంలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ కూలి పని చేస్తున్నారు. ఈ నెల 20వ తేదీన ఇరువురు గొడవ పడ్డారు. అనంతరం బాలాజీ కనపడ లేదు. శనివారం దుర్వాసన రావడంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ సంజీవ్ మృతదేహాన్ని మార్చురీకి తరలించి దర్యాప్తు చేపట్టారు.