News October 20, 2024

NZB: GGHలో కిడ్నాప్.. మహారాష్ట్రలో లభ్యం

image

నిజామాబాద్ GGHలో కిడ్నాప్ అయిన బాలుడి ఆచూకీని పోలీసులు కనిపెట్టారు. మద్నూర్‌కు చెందిన పిట్ల రాజు, లక్ష్మి దంపతులు శుక్రవారం రాత్రి ఆస్పత్రి ఆవరణలో నిద్రించగా వారి కుమారుడు మణికంఠను ముగ్గురు మహిళలు ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితులు మహారాష్ట్రకు వెళ్లినట్లు గుర్తించారు. ప్రత్యేక బృందంతో మహారాష్ట్రకు వెళ్లి నిందితులను, బాలుడిని గుర్తించారు.

Similar News

News November 3, 2024

ఆర్మూర్: పూల కుండీ పేలి బాలుడి చేతికి తీవ్ర గాయాలు

image

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని హుస్నాబాద్ కాలనీలో దీపావళి పండుగ మరుసటి రోజు పూలకుండీ పేలడంతో ఓ బాలుడు చేతికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర గాయాలైన బాలుడిని కుటుంబ సభ్యులు వెంటనే ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. టపాసులు నాసిరకంగా ఉండడం వల్లే ప్రమాదం జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు.

News November 2, 2024

నిజామాబాద్ జిల్లాలో భారీ చోరీ

image

నిజామాబాద్ సుభాష్ నగర్ న్యూ ఎన్జీవో కాలనీలో తాళం వేసిన ఇంట్లో భారీ దోపిడీ జరిగింది. కాలనీకి చెందిన సముద్రాల ఏలేశ్వరరావు కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి తాళం వేసి ఊరెళ్లగా గుర్తు తెలియని దొంగలు తాళం పగుల గొట్టి చోరికి పాల్పడ్డారు. బీరువాలోని 22 తులాల బంగారు, 8 తులాల వెండి ఆభరణాలు దోచుకుపోయారు. ఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు త్రీ టౌన్ SHO మహేశ్ తెలిపారు.

News November 2, 2024

NZB: గ్రామ పంచాయతీ ఎన్నికలు.. అందరి దృష్టి వారిపైనే..

image

కులగణన తర్వాత గ్రామ పంచాయతీ జరగనున్న సంగతి తెలిసిందే. దీని కోసం 2,3 నెలలు పట్టనుండగా గ్రామాల్లో ఆశావహులు అప్పుడే ఎన్నికల సన్నాహాల్లో మునిగి తేలుతున్నారు. కులాలు, కాలనీల వారీగా లెక్కలు వేసుకుంటున్నారు. నిజామాబాద్ జిల్లాలో గ్రామాల నుంచి పట్టణాలకు వెళ్లిన వారి వివరాలను సేకరిస్తున్నారు. ఫోన్లు చేసి మామ, బాబాయ్, అల్లుడు అంటూ వరుసలు కలుపుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు.