News March 16, 2025
NZB: GREAT.. గ్రూప్- 2, 3లో సత్తా చాటిన SI

గ్రూప్-3 ఫలితాల్లో NZB <<15733792>>డిచ్పల్లి 7వ బెటాలియన్ రిజర్వుడ్ SI ఓరంగంటి అశోక్ మరోసారి స్టేట్లో 14వ ర్యాంకు <<>>సాధించారు. SI స్వస్థలం వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం, లింగాపూర్ గ్రామం. ఇటీవల విడుదలైన గ్రూప్-3 ఫలితాల్లో 320 మార్కులు సాధించి BC(A)తో పాటు, భద్రాద్రి జోన్ టాపర్గా నిలిచారు. అలాగే గ్రూప్-2లో సైతం స్టేట్ 57 ర్యాంక్, BC(A)లో ఫస్ట్ ర్యాంకు సాధించారు. గ్రూప్- 2,3లో సత్తా చాటిన SI పై మీ కామెంట్?
Similar News
News October 18, 2025
ఒంటిమిట్టకు తిరుమల లడ్డూలు

ఒంటిమిట్ట రామాలయానికి వచ్చే భక్తులకు 600 తిరుమల లడ్డూలు శనివారం అందుబాటులో ఉంటాయని ఆలయ అధికారి నవీన్ తెలిపారు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఒక్కోటి రూ.50గా విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఆలయ ప్రాంగణంలో ప్రసాదాలు పొందవచ్చన్నారు.
News October 18, 2025
సంగారెడ్డి: గురుకులాల్లో మిగుల సీట్ల భర్తీ

సంగారెడ్డి జిల్లాలోని అన్ని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 2025-26 విద్యాసంవత్సరానికి గాను 5 నుంచి 9వ తరగతి వరుకు గల ఖాళీలను భర్తీ చేయనున్నారు. విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల / కళాశాల ఇస్నాపూర్ హెచ్ఎం జయలక్ష్మి తెలిపారు. దరఖాస్తులను ఇస్నాపూర్ బాలికల పాఠశాలలో ఈ నెల 22 మధ్యాహ్నం లోపు అందజేయాలని సూచించారు.
News October 18, 2025
చెత్త వెస్తే జరిమానా విధించడం: కలెక్టర్ హెచ్చరిక

ఏలూరు జిల్లాలోని కాలవల్లో, రోడ్డు ప్రక్కన కొందరు చెత్త వేస్తున్నారని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మండిపడ్డారు. శుక్రవారం ఏలూరు కలెక్టరేట్లో వెట్రిసెల్వి మాట్లాడారు. నగరం, పట్టణం, పల్లెల్లో యథేచ్చగా ఎక్కడ పడితే అక్కడ చెత్తను వేసే వారిని గుర్తించి జరిమానాలు విధించాలని అధికారులకు ఆదేశించారు. చెత్తరహిత జిల్లాగా తీర్చిదిద్దటానికి అన్ని ప్రాంతాల వారు సహకరించాలని కలెక్టర్ కోరారు.