News April 1, 2025

NZB: IIIT విద్యార్థి ఆత్మహత్య.. కాశీలో అంత్యక్రియలు

image

వర్ని మండలం సత్యనారాయణపురం గ్రామానికి చెందిన <<15944978>>రాహుల్ చైతన్య(18) అలహాబాద్ IIITలో ఆత్మహత్య చేసుకున్న<<>> విషయం తెలిసిందే. కాగా రాహుల్ చైతన్య అలహాబాద్ IIITలో బీటెక్ చేస్తున్నాడు. ఆదివారం తెల్లవారుజామున భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. రాహుల్ చైతన్య అంత్యక్రియలను కాశీలో నిర్వహించారు.

Similar News

News April 2, 2025

NZB: పిల్లలతో తండ్రి సూసైడ్ అటెంప్ట్

image

బాసర గోదావరి బ్రిడ్జిపై నుంచి దూకడానికి ప్రయత్నించిన నిజామాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు చిన్నారులతో పాటు తండ్రిని బాసర పోలీసులు కాపాడారు. కుటుంబ కలహాలతో NZB బోయగల్లికి చెందిన గంగాప్రసాద్‌తో పాటు ఇద్దరు చిన్నారులను కానిస్టేబుల్ మోహన్‌సింగ్ కాపాడి మానవత్వాన్ని చాటుకున్నారు. పోలీస్ స్టేషన్‌కు తరలించి కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబీలకు అప్పగిస్తామని తెలిపారు. కానిస్టేబుల్‌ను బాసర ఎస్ఐ గణేశ్ అభినందించారు.

News April 2, 2025

NZB: రేషన్ షాపులను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్

image

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని చంద్రశేఖర్ కాలనీలో పలు రేషన్ దుకాణాలను అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీని ప్రారంభించిన నేపథ్యంలో లబ్ధిదారులకు సజావుగా బియ్యం పంపిణీ చేస్తున్నారా లేదా అని పరిశీలించారు. ఇప్పటి వరకు ఎంత పరిమాణంలో బియ్యం పంపిణీ జరిగింది, ఇంకా ఎంత మందికి పంపిణీ చేయాల్సి ఉంది తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు.

News April 2, 2025

రుద్రూర్: యువకుడి అదృశ్యం

image

రుద్రూర్‌కు చెందిన విజయ్ కుమార్ అనే వ్యక్తి అదృశ్యమైనట్టు ఎస్ఐ సాయన్న తెలిపారు. గత ఏడాది ఇల్లు కట్టడానికి అప్పులు కావడం వల్ల విజయ్ కుమార్ మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో గత నెల 11న ఇంట్లో నుంచి వెళ్లిన అతను తిరిగి రాలేదు. పలు చోట్ల వెతికినప్పటికీ ఆచూకీ లభించకపోవడంతో అతని భార్య మంగళవారం ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు.

error: Content is protected !!