News September 3, 2024
NZB: KCR ఎక్కడ?: మహేశ్ కుమార్ గౌడ్
ఇంతటి విపత్తులోనూ KCR ఎక్కడా కనిపించడం లేదని MLC, TPCC వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. BRS బాధ్యతగా వ్యవహరించాల్సిన సమయం ఇది అని, KCR ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో చిన్న వర్షం పడినా గందరగోళ పరిస్థితి ఉండేదని, ఇప్పుడు అలా ఏం లేదని చెప్పారు. వర్షాలపై CM రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఆరా తీస్తున్నారన్నారు. KCRకు అధికారముంటేనే తెలంగాణ కనిపిస్తుందా అని ప్రశ్నించారు.
Similar News
News September 21, 2024
నాగన్న బావి పునరుద్ధరణ పనులను ప్రారంభించిన కలెక్టర్
లింగంపేటలో పరంపర ఫౌండేషన్, రైన్ వాటర్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో నాగన్న బావి పునరుద్ధరణ పనులను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, ఎస్పీ సింధు శర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రాచీన కట్టడాలకు పరంపర ఫౌండేషన్ ఆధ్వర్యంలో పూర్వ వైభవం తీసుకురావడం అభినందనీయమని కొనియాడారు. ప్రాచీన కట్టడాలు పునరుద్ధరణ చేయడంవల్ల భావితరాలకు పూర్వకాలం చరిత్ర తెలిసే వీలు కలుగుతుందని తెలిపారు.
News September 20, 2024
రైల్వేమంత్రిని కలిసిన NZB ఎంపీ అర్వింద్
రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను NZB ఎంపీ అర్వింద్ దిల్లీలోని కేంద్రమంత్రి కార్యాలయంలో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో రైల్వేకి సంబంధించి, పెండింగ్‌లో ఉన్న పలు అంశాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఆర్వోబీల నిర్మాణం పనులను వేగవంతం చేసేలా అధికారులకు సూచనలను ఇవ్వాలని కోరారు. దీనికి మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ తెలిపారు.
News September 20, 2024
ఆలూరు : వీధికుక్కల దాడిలో ఏడుగురికి గాయాలు
నిజామాబాద్ జిల్లా ఆలూరు మండల కేంద్రంలో శుక్రవారం పిచ్చి కుక్కలు స్వైరవిహారం చేశాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పిచ్చికుక్కల దాడిలో ఏడుగురు గాయపడ్డారని చెప్పారు. గాయాలైన వారిని మొదటగా దేగాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారని స్థానికులు పేర్కొన్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.