News November 21, 2025
NZB: KCR ఫ్యామిలీతో గోక్కున్నోడెవరూ బాగుపడలే: జీవన్ రెడ్డి

‘KCR ఫ్యామిలీతో గోక్కున్నోడెవరూ బాగుపడలే’ అని BRS నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ MLA ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఉద్యమ కాలంలో వైఎస్సార్, చంద్రబాబు వంటి వారికే చుక్కలు చూపించామని అన్నారు. ఈ రేవంత్ రెడ్డి ఎంత, తెలంగాణ రాష్ట్ర చివరి కాంగ్రెస్ CMగా మిగిలిపోవడం ఖాయమన్నారు.
Similar News
News November 21, 2025
ఖమ్మం: ఇందిరమ్మ చీరల పంపిణీకి మంత్రి తుమ్మల ఆదేశం

ఖమ్మం జిల్లాలో 18ఏళ్లు నిండిన ప్రతి గ్రామీణ మహిళకు ఇందిరమ్మ చీరలను ఇంటింటికీ వెళ్లి బొట్టు పెట్టి అందించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌లోపు పంపిణీ పూర్తి చేయాలని సూచించారు. అభివృద్ధి పనులు నాణ్యతతో జరిగేలా చూడాలన్నారు. గ్రామ పంచాయతీల్లో ఏకగ్రీవంగా సర్పంచ్‌లను ఎన్నుకుంటే రూ.10 లక్షల గ్రాంట్ ఇస్తామని మంత్రి ప్రకటించారు.

బ్రెయిన్ స్ట్రోక్‌కి ముందు కనిపించే లక్షణాలు ఇవే

మెదడుకు ఆక్సిజన్, రక్తం సరఫరాలో తేడాతో బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. స్ట్రోక్ సడెన్‌గా వచ్చినప్పటికీ నెలల ముందు నుంచే కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అసాధారణ తలనొప్పి, ముఖం, కాళ్లు, చేతుల్లో తిమ్మిర్లు, చూపులో తేడా, తలతిరగడం వంటివి బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి ముందు కనిపించే లక్షణాలని వైద్యులు చెబుతున్నారు. ఒక్కసారిగా నీరసంగా అనిపించడం, అంతే వేగంగా తగ్గినట్టు అనిపిస్తే వెంటనే డాక్టరును సంప్రదించాలి.