News April 3, 2025
NZB: LRS గడువు పొడిగింపును సద్వినియోగం చేసుకోండి: కలెక్టర్

LRS రిబేట్ గడువు పొడిగింపును సద్వినియోగం చేసుకోవాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బుధవారం జిల్లా ప్రజలకు సూచించారు. అనధికార లే ఔట్ల క్రమబద్దీకరణ, ప్లాట్ల రెగ్యులరైజేషన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన LRS 25 శాతం రాయితీ సదుపాయాన్ని ఏప్రిల్ 30 వరకు పొడిగించిందని తెలిపారు. మార్చి 31వ తేదీ నాటితో ఈ గడువు ముగియగా, ప్రజల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు ప్రభుత్వం పొడిగించిందన్నారు.
Similar News
News April 11, 2025
NZB: ‘సామాజిక సేవా నిర్వహించడం గొప్ప విషయం’

నిజామాబాద్ జిల్లా జడ్జి సునీతా కుంచాల విస్తృత స్థాయిలో సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించడం ఎంతో గొప్ప విషయమని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు కొనియాడారు. కలెక్టరేట్ లో గురువారం సాయంత్రం నిర్వహించిన పలు పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఎంతగానో పని ఒత్తిడితో కూడుకుని ఉండే విధుల్లో కొనసాగుతున్నప్పటికీ జిల్లా జడ్జి సేవా కార్యక్రమాలు జరపడం విశేషమన్నారు.
News April 10, 2025
UPDATE: NZB: అంత్యక్రియల అనంతరం అదుపులోకి తీసుకునే అవకాశం?

నిజాంబాద్ జిల్లా బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ను ఆయన తల్లి అంత్యక్రియల అనంతరం పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. ఆయన విషయంలో గతంలోనే పోలీసులు లుక్ ఔట్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అందుకే గురువారం ఆయన దుబాయ్ నుంచి రాగానే అతని వద్ద ఉన్న పాస్‌పోర్టును స్వాధీనం చేసుకున్నారు. సెంట్రల్ జోన్ పోలీసులు ఆయన మీద పలు కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
News April 10, 2025
శంషాబాద్‌లో ఫ్లైట్ దిగగానే మాజీ MLA అరెస్ట్

బోధన్ మాజీ MLA షకీల్‌ను శంషాబాద్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొన్ని నెలలుగా దుబాయ్‌లో ఉంటున్న మాజీ ఎమ్మెల్యే.. తల్లి అంత్యక్రియల కోసం HYDకు వచ్చారు. ఎయిర్‌పోర్టులో దిగగానే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. షకీల్‌పై పోలీసు శాఖ గతంలో లుకౌట్ నోటీసులు జారీ చేసింది. ప్రగతిభవన్ వద్ద యాక్సిడెంట్లో సాక్షాలు తారుమారు చేసి కుమారుడిని రక్షించేందుకు యత్నించినట్లు ఆయన మీద అభియోగాలు ఉన్నాయి.