News April 3, 2025

NZB: LRS గడువు పొడిగింపును సద్వినియోగం చేసుకోండి: కలెక్టర్

image

LRS రిబేట్ గడువు పొడిగింపును సద్వినియోగం చేసుకోవాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బుధవారం జిల్లా ప్రజలకు సూచించారు. అనధికార లే ఔట్ల క్రమబద్దీకరణ, ప్లాట్ల రెగ్యులరైజేషన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన LRS 25 శాతం రాయితీ సదుపాయాన్ని ఏప్రిల్ 30 వరకు పొడిగించిందని తెలిపారు. మార్చి 31వ తేదీ నాటితో ఈ గడువు ముగియగా, ప్రజల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు ప్రభుత్వం పొడిగించిందన్నారు.

Similar News

News April 4, 2025

NZB: ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య

image

నిజామాబాద్ నగరంలోని గాయత్రీ నగర్‌లో ఎర్రమల పవన్ రాజు(25) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు 4వ టౌన్ ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. మృతుడు నగరంలోని ఒక బట్టల షాపు వేర్ హౌస్‌లో పని చేసేవాడు. అక్కడ పని చేసే అతడి స్నేహితురాలు వ్యక్తిగత కారణాలతో మృతి చెందగా నాటి నుంచి మానసికంగా కుంగిపోయాడు. ఈ నేపథ్యంలో ఆత్మహత్య చేసుకోగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు.

News April 3, 2025

NZB: ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన

image

వర్ని(M) జాకోరా, జలాల్పూర్ గ్రామాల్లో నెలకొల్పిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్‌తో కలిసి గురువారం పరిశీలించారు. రైతుల నుంచి ధాన్యం సేకరిస్తున్న ప్రక్రియను పరిశీలించారు. కేంద్రం నిర్వాహకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు ఎంత పరిమాణంలో సన్నరకం, దొడ్డురకం ధాన్యాన్ని సేకరించారు. ట్రక్ షీట్స్ వచ్చాయా, బిల్ టాగ్ అయ్యిందా అని ఆరా తీశారు.

News April 3, 2025

నిజామాబాద్: జిల్లాలో తగ్గిన ఎండ తీవ్రత

image

నిజామాబాద్ జిల్లాలో ఎండ తీవ్రత కాస్త తగ్గింది. బుధవారం గోపనపల్లెలో 37.6℃ నమోదైంది. వైల్పూర్ 37.3, మోస్రా 37.2, పెర్కిట్ 37, కోటగిరి 36.8, వేంపల్లి 36.6, యర్గట్ల, యడపల్లి 36.5, లక్ష్మాపూర్ 36.3, మల్కాపూర్ 36.2, ముప్కాల్, నిజామాబాద్ 36.1, ఆలూరు, బాల్కొండ 36, మెండోరా, భీంగల్, ఇస్సాపల్లి 35.9, మగ్గిడి 35.7℃ నమోదైంది. మిగతా ప్రాంతాల్లోనూ గరిష్ఠ ఉష్ణోగ్రతలు తక్కువగానే ఉన్నాయి.

error: Content is protected !!