News March 6, 2025
NZB: MLC ఎన్నికలు.. ఎవరికి ఎన్ని ఓట్లంటే..?

ఉమ్మడి కరీంనగర్, మెదక్, అదిలాబాద్, నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి విజయం సాధించిన విషయం తెలిసిందే. రెండో ప్రాధాన్యత ఓట్లతో బీజేపీ నుంచి పోటీ చేసిన అంజిరెడ్డి 98,637 ఓట్లతో విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన నరేందర్ రెడ్డికి 93,531 ఓట్లు వచ్చాయి. బీఎస్పీ నుంచి పోటీ చేసిన ప్రసన్న హరికృష్ణకు 63,972 ఓట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
Similar News
News March 6, 2025
NZB: 420 మంది విద్యార్థుల గైర్హాజరు

నిజామాబాద్ జిల్లాలో గురువారం నిర్వహించిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర పరీక్షలకు 420 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి (DIEO) రవి కుమార్ తెలిపారు. జిల్లాలో మొత్తం 16,343 మంది విద్యార్థులకు 15,923 మంది పరీక్షలకు (97.4 శాతం) హాజరయ్యారని తెలిపారు. ఖిల్లా ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల బీ సెంటర్లో ఓ విద్యార్థి చీటీలు రాస్తుండగా పట్టుకున్నారన్నారు.
News March 6, 2025
NZB: ఇంటర్ పరీక్షా కేంద్రం తనిఖీ చేసిన కలెక్టర్

డిచ్పల్లిలోని రెసిడెన్షియల్ స్కూల్లో కొనసాగుతున్న ఇంటర్ పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా గదులను సందర్శించి, పరీక్షల నిర్వహణ, సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. కాపీయింగ్‌కు అవకాశం లేకుండా గట్టి నిఘాతో పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. సెల్ ఫోన్లను ఎట్టి పరిస్థితుల్లోనూ లోనికి అనుమతించకూడదని సూచించారు.
News March 6, 2025
NZB: పట్టభద్రుల ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఓడిపోయింది: కవిత

కరీంనగర్ పట్టభద్రుల ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఓడిపోయిందని BRS ఎమ్మెల్సీ కవిత అన్నారు. కాంగ్రెస్, బీజేపీలు బీసీయేతర అభ్యర్థులను బరిలోకి దింపాయని, పార్టీలపరంగా, సిద్ధాంతపరంగా ఓట్లు చీలాయన్నారు. కాబట్టి పోటీలో ఉన్న బీసీ అభ్యర్థి హరికృష్ణ గెలవలేదని ఆమె అన్నారు. బీసీ రిజర్వేషన్లు ఉంటే ఆ స్థానంలో కచ్చితంగా అన్ని పార్టీలు బీసీకే టికెట్ ఇచ్చేవని వ్యాఖ్యానించారు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు ఉండాలన్నారు.