News March 6, 2025
NZB: MLC ఎన్నికలు.. ఎవరికి ఎన్ని ఓట్లంటే..?

ఉమ్మడి కరీంనగర్, మెదక్, అదిలాబాద్, నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి విజయం సాధించిన విషయం తెలిసిందే. రెండో ప్రాధాన్యత ఓట్లతో బీజేపీ నుంచి పోటీ చేసిన అంజిరెడ్డి 98,637 ఓట్లతో విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన నరేందర్ రెడ్డికి 93,531 ఓట్లు వచ్చాయి. బీఎస్పీ నుంచి పోటీ చేసిన ప్రసన్న హరికృష్ణకు 63,972 ఓట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
Similar News
News October 17, 2025
అనుమతులు లేకుండా బాణసంచా విక్రయిస్తే చర్యలు: శ్రీకాకుళం కలెక్టర్

అనుమతులు లేకుండా బాణసంచా విక్రయించినా, తయారు చేసినా కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ హెచ్చరించారు. శుక్రవారం శ్రీకాకుళం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. అధికారులు గ్రామస్థాయిలో సైతం తనిఖీలు నిర్వహించాలన్నారు. బాణసంచా విక్రయాల కోసం అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేశారు. హోల్సేల్ షాపులను పోలీస్, ఫైర్, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా తనిఖీ చేయాలన్నారు.
News October 17, 2025
ప్రత్యేక కార్యాచరణతో విజయోస్తు 2.0: కలెక్టర్

జనగామ జిల్లా విద్యా వ్యవస్థ మరింత బలోపేతం కావాలని, అన్ని అంశాల్లో రాష్ట్ర స్థాయిలో మెరుగైన స్థానంలో జిల్లా నిలబడేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. అదనపు కలెక్టర్, జిల్లా విద్య శాఖ అధికారి పింకేష్ కుమార్‌తో కలిసి విజయోస్తు 2.0, పదవ తరగతి పరీక్షలు, డిజిటల్ లర్నింగ్ కరిక్యులం, లైబ్రరీ, తదితర అంశాలపై విద్యాశాఖ అధికారులు ప్రధానోపాధ్యాయులతో రివ్యూ నిర్వహించారు.
News October 17, 2025
ధర్మపురి: విద్యార్థులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్

ధర్మపురి పట్టణంలోని కస్తూర్బా పాఠశాలను శుక్రవారం కలెక్టర్ సత్యప్రసాద్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి భోజనం చేసి భోజనం నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని అందించాలని సూచించారు. పాఠశాల ఆవరణలో గల ఖాళీ స్థలంలో కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేయాలన్నారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. ఆయన వెంట ఆర్డీఓ, డీఈఓ, తహశీల్దార్ తదితరులున్నారు.