News March 6, 2025
NZB: MLC ఎన్నికలు.. ఎవరికి ఎన్ని ఓట్లంటే..?

ఉమ్మడి కరీంనగర్, మెదక్, అదిలాబాద్, నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి విజయం సాధించిన విషయం తెలిసిందే. రెండో ప్రాధాన్యత ఓట్లతో బీజేపీ నుంచి పోటీ చేసిన అంజిరెడ్డి 98,637 ఓట్లతో విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన నరేందర్ రెడ్డికి 93,531 ఓట్లు వచ్చాయి. బీఎస్పీ నుంచి పోటీ చేసిన ప్రసన్న హరికృష్ణకు 63,972 ఓట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
Similar News
News March 15, 2025
చెన్నారావుపేట: ఏఐ ద్వారా విద్యాబోధన ప్రారంభం

చెన్నారావుపేట మండల ప్రాథమిక పాఠశాలలో శనివారం ఏఐ ద్వారా బోధనను కలెక్టర్ సత్య శారదా దేవి ప్రారంభించారు. ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలల్లో కృత్రిమ మేధను వినియోగిస్తూ సులభతరంగా విద్యను అందిపుచ్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. అందులో భాగంగా పైలెట్ ప్రాజెక్టు కింద జిల్లా వ్యాప్తంగా 11 ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ సహకారంతో వర్చువల్ రియాల్టీ విధానంలో పాఠాలు చెప్పేలా ప్రారంభించుకున్నామన్నారు.
News March 15, 2025
నర్సాపూర్: నాటు తుపాకులతో తిరుగుతున్న 8 మంది అరెస్ట్

మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం నత్నాయపల్లి అటవీ ప్రాంతంలో వన్యప్రాణులను వేటకు నాటు తుపాకీలతో తిరుగుతున్న ఎనిమిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వారిపై పోలీసు కేసు నమోదైంది. అరెస్టయిన వారిలో యాసిన్, శ్రీకాంత్, కృష్ణ, శంకరయ్య, వీరాస్వామి, పోచయ్య, విజయ్, భాను ప్రసాద్ ఉన్నారు. వారిని కోర్టులో హాజరు పరిచారు.
News March 15, 2025
20 ఏళ్ల తర్వాత మళ్లీ జహీర్ ఖాన్‌కు ‘ఐ లవ్ యూ’

ఎప్పుడో 20 ఏళ్ల క్రితం భారత పేస్ బౌలర్ జహీర్ ఖాన్‌కు లవ్ ప్రపోజ్ చేసిన యువతి మరోసారి వార్తల్లోకెక్కారు. లక్నో జట్టు మెంటార్‌గా ఉన్న జహీర్‌కు ఓ హోటల్లో మరోసారి అదే రీతిలో ప్రపోజ్ చేశారు. ‘జహీర్ ఐ లవ్ యూ’ అని పోస్టర్ ప్రదర్శించారు. ఈ ఫొటోను LSG షేర్ చేసింది. కాగా 2005లో టీవీఎస్ కప్ సిరీస్‌లో భాగంగా భారత్-పాకిస్థాన్ మ్యాచ్ సందర్భంగా ఈ యువతి లవ్ ప్రపోజ్ చేసి వైరల్ అయ్యారు.