News March 6, 2025

NZB: MLC ఎన్నికలు.. ఎవరికి ఎన్ని ఓట్లంటే..?

image

ఉమ్మడి కరీంనగర్, మెదక్, అదిలాబాద్, నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి విజయం సాధించిన విషయం తెలిసిందే. రెండో ప్రాధాన్యత ఓట్లతో బీజేపీ నుంచి పోటీ చేసిన అంజిరెడ్డి 98,637 ఓట్లతో విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన నరేందర్ రెడ్డికి 93,531 ఓట్లు వచ్చాయి. బీఎస్పీ నుంచి పోటీ చేసిన ప్రసన్న హరికృష్ణకు 63,972 ఓట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

Similar News

News March 6, 2025

పార్వతీపురం:‘తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూడాలి’

image

వేసవిలో గ్రామాల్లో ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడకుండా తక్షణ చర్యలు అధికార యంత్రాంగం చేపట్టాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్ అన్నారు. గురువారం మండల స్థాయి అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాగునీటికి ప్రజలు ఇబ్బందులు పడకుండా ముందస్తుగా తాగునీటి ఎద్దడిని గుర్తించి తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.

News March 6, 2025

సత్తా చాటుతున్న బీజేపీ.. BRSకు దెబ్బేనా?

image

TG: కాంగ్రెస్, BRSను బీజేపీ భయపెడుతోంది. ప్రధాన ప్రతిపక్షం BRS ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంది. BSP అభ్యర్థికి మద్దతు తెలిపింది. కాంగ్రెస్ నేరుగా పోటీ చేసింది. అయినా బీజేపీ సంచలన విజయం సాధించింది. అటు కేసీఆర్ జనంలోకి రాకపోవడంతో తామే ప్రతిపక్షం అని క్షేత్రస్థాయిలో కాషాయపార్టీ విస్తరించే అవకాశం ఉంది. ప్రస్తుతం బీజేపీ వల్ల BRSకే పెద్ద ముప్పు అని విశ్లేషకుల అంచనా. మీ కామెంట్?

News March 6, 2025

శ్రీకాకుళం: ఇంటర్ పరీక్షలలో 815 మంది గైర్హాజర్

image

శ్రీకాకుళం జిల్లాలో జరుగుతున్న ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలలో భాగంగా
గురువారం పరీక్షకు 815 మంది గైర్హాజరయ్యారని ఆర్ఐఓ ప్రగడ దుర్గారావు తెలిపారు. జనరల్‌లో 21156 మంది, ఒకేషనల్‌లో 1342 మంది పరీక్షల్లో హాజరు కావలసి ఉందని వివరించారు. మొత్తంగా 22498 మందికి గాను 21683 మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారని పేర్కొన్నారు.

error: Content is protected !!