News May 7, 2024

NZB: NDAకు 250 కి మించి సీట్లు రావు: KCR

image

NDA కూట‌మికి 250కి మించి సీట్లు రావని BRS అధినేత KCR జోస్యం చెప్పారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నెహ్రు చౌర‌స్తాలో సోమవారం రాత్రి నిర్వ‌హించిన రోడ్ షోలో KCR పాల్గొని ప్ర‌సంగిస్తూ కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్ గవ‌ర్న‌మెంట్ రాదన్నారు. ప్రాంతీయ శ‌క్తులే ఏర్పాటు చేసే ప్రభుత్వం వస్తుందని, BRS 14 ఎంపీ స్థానాలు గెలిస్తే కేంద్ర రాజ‌కీయాల్లో తెలంగాణ కీల‌కంగా మారుతుందన్నారు.

Similar News

News January 17, 2025

నిర్మలా సీతారామన్‌ను కలిసిన ఎంపీ అరవింద్

image

కేంద్ర ఆర్థిక శాఖామంత్రి నిర్మలా సీతారామన్‌ను నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నిర్మల సీతారామన్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో ఇటీవలి పరిణామాలను వివరించాను. అదేవిధంగా కొత్తగా ప్రారంభించబడిన జాతీయ పసుపు బోర్డు పట్ల రాష్ట్రంలో జరుగుతున్న ఆనందోత్సాహాలు వారికి వివరించారు.

News January 17, 2025

NZB: గాలిపటం కోసం యత్నించిన బాలుడికి షాక్

image

విద్యుత్ వైర్లపై ఉన్న గాలిపటాన్ని తీసేందుకు యత్నించిన బాలుడు విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. నిజామాబాద్ వినాయక్ నగర్‌లో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. కాలనీకి చెందిన షేక్ జిశాంత్ బంగ్లాపై ఆడుకుంటూ ఉండగా విద్యుత్ వైర్లకు గాలిపటం ఉండటంతో దాన్ని తీసే క్రమంలో సర్వీస్ వైర్లు తగిలి షాక్‌కు గురయ్యాడు. 50% కాలిన గాయలతో బాలుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 4వ టౌన్ ఎస్ఐ శ్రీకాంత్ దర్యాప్తు చేపట్టారు.

News January 17, 2025

లింగంపేట్: యాక్సిడెంట్‌లో యువకుడి మృతి.. గ్రామస్థుల ధర్నా

image

లింగంపేట మండలం ముస్తాపూర్ తండాలో గ్రామానికి చెందిన మోహన్ అనే యువకుడు గురువారం రాత్రి బైక్‌పై వెళ్తుండగా వెనక నుంచి లారీ ఢీకొట్టడంతో అతను మృతి చెందాడు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యంతో అతను మృతి చెందాడని కామారెడ్డి-ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై గ్రామస్థులు శుక్రవారం ధర్నా చేపట్టారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. దీంతో ఇరువైపులా ట్రాఫిక్ నిలిచిపోయింది.