News February 20, 2025
NZB: NEXT ఎలక్షన్లో 100 MLA సీట్లు మావే: TPCC చీఫ్

బీసీలపై ప్రేమతోనే కులగణన చేపట్టామని TPCC అధ్యక్షుడు బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. BRS, BJP ఒక్కటే అని, అవి లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నాయని విమర్శించారు. రాష్ట్రం నుంచి 8 మంది BJP ఎంపీలు ఉంటే కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు ఒక్క రూపాయి కూడా తేలేదన్నారు. బీజేపీ మతం పేరుతో రాజకీయాలు చేస్తోందన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 100 ఎమ్మెల్యే సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
Similar News
News December 13, 2025
HYD: డిసెంబర్ 19 నుంచి బుక్ ఫెయిర్

38వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ను ఈ నెల 19 నుంచి 29 వరకు 11 రోజుల పాటు నిర్వహించనున్నట్లు హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ తెలిపింది. పుస్తక స్ఫూర్తి, బాలోత్సవం, పుస్తకావిష్కరణలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. ప్రాంగణానికి ప్రజాకవి అందెశ్రీ, ప్రధాన వేదికకు అనిశెట్టి రజిత, పుస్తకావిష్కరణ వేదికకు కొంపల్లి వెంకట్ గౌడ్ పేర్లు నిర్ణయించారు.
News December 13, 2025
జగిత్యాల: ఏం చేశారని విజయోత్సవాలు: విద్యాసాగర్ రావు

ఏం చేశారని విజయోత్సవాలు చేసుకుంటున్నారని జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు విద్యాసాగర్ రావు అన్నారు. జగిత్యాల పార్టీ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. కేసీఆర్ హాయాంలో అభివృద్ధి పనులు పరుగులు పెట్టాయని, కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేళ్లు కావస్తున్నా అభివృద్ధి కనబడటం లేదని అన్నారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే రవి శంకర్, దావ వసంత ఉన్నారు.
News December 13, 2025
ఈనెల 14 నుంచి ఇంధన పొదుపు వారోత్సవాలు: CMD

ఈనెల 14 నుంచి 20వ తేదీ వరకు జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు నిర్వహించాలని APEPDCL సీఎండీ పృథ్వీ తేజ్ సిబ్బందికి ఆదేశించారు. విజయనగరం జిల్లా వ్యాప్తంగా విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో విభిన్న కార్యక్రమాలు చేపట్టి అన్ని వర్గాల విద్యుత్ వినియోగదారులకు ఇంధన పొదుపుపై అవగాహన కల్పించాలని శనివారం కోరారు. కళాశాల విద్యార్థులకు వర్క్షాప్లు, పాఠశాల విద్యార్థులకు వ్యాస రచన, వక్తృత్వ పోటీలు నిర్వహించాలని సూచించారు.


