News February 20, 2025

NZB: NEXT ఎలక్షన్‌లో 100 MLA సీట్లు మావే: TPCC చీఫ్

image

బీసీలపై ప్రేమతోనే కులగణన చేపట్టామని TPCC అధ్యక్షుడు బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. BRS, BJP ఒక్కటే అని, అవి లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నాయని విమర్శించారు. రాష్ట్రం నుంచి 8 మంది BJP ఎంపీలు ఉంటే కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు ఒక్క రూపాయి కూడా తేలేదన్నారు. బీజేపీ మతం పేరుతో రాజకీయాలు చేస్తోందన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 100 ఎమ్మెల్యే సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Similar News

News April 12, 2026

జగిత్యాల: గురు-శిష్యుల మధ్య రాజకీయ యుద్ధం మొదలవుతుందా?

image

జగిత్యాల జిల్లాలో జీవన్ రెడ్డి రాజకీయ నిర్ణయం కలకలం రేపుతోంది. ఆయన పార్టీ మార్పుతో మిత్రులు, శత్రువుల సమీకరణాలు మారుతున్నాయి. తనను గురువుగా భావించే మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పరిస్థితి సంక్లిష్టంగా మారింది. పార్టీ కోసం గురువుపై విమర్శలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. జీవన్ రెడ్డి నిర్ణయం ప్రభావం మంత్రి అడ్లూరి రాజకీయ భవిష్యత్తుపై పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

News April 12, 2026

NTR: ట్యాంకర్ కింద BMW.. టెక్నికల్ టీమ్ ఏం తేలుస్తుందో?

image

కంచికచర్ల మండలం కీసర టోల్ ప్లాజా వద్ద శనివారం జరిగిన భీకర ప్రమాదంపై విచారణ వేగవంతమైంది. ట్యాంకర్ కారుపై పడటంతో BMW కారు పూర్తిగా నుజ్జునుజ్జైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ప్రమాద తీవ్రతను, సాంకేతిక కారణాలను విశ్లేషించడానికి కంపెనీకి చెందిన సాంకేతిక బృందం ఆదివారం ఘటనా స్థలానికి రానుంది. వాహన ధ్వంసం, ప్రమాద తీరుపై ఈ బృందం లోతుగా పరిశీలించి నివేదిక ఇవ్వనుంది.

News April 12, 2026

చర్చలు విఫలం.. ఏం జరగబోతోంది?

image

అమెరికా-ఇరాన్ చర్చలు <<19629050>>విఫలం<<>> కావడంతో 14 రోజుల సీజ్‌ఫైర్ ముగిసిపోయే ప్రమాదం ఉంది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడే అవకాశం ఉంది. ఆ దేశంలోని న్యూక్లియర్, విద్యుత్, ఆయిల్ ప్లాంట్లను ధ్వంసం చేయవచ్చు. అటు ఇరాన్ గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలు, చమురు క్షేత్రాలు, రిఫైనరీ ప్లాంట్లను టార్గెట్ చేసుకొని అటాక్ చేసే ఛాన్స్ ఉంది. హార్ముజ్ జలసంధిని ఇరాన్ పూర్తిగా మూసివేయవచ్చు.