News July 22, 2024
NZB: SRSP అప్డేట్: 21 వేల క్యూసెక్కులకు పెరిగిన ఇన్ ఫ్లో
నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు నీటి ఇన్ ఫ్లో పెరుగుతోంది. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రాజెక్టుకు ఇన్ ఫ్లోగా 20,023 క్యూసెక్కుల నీరు రాగా రాత్రి 9 గంటలకు 21,500 క్యూసెక్కులుగా ఇన్ ఫ్లో పెరిగింది. ఔట్ ఫ్లోగా 518 క్యూసెక్కుల నీటిని వదిలారు. ఇక ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులు ఉండగా ప్రస్తుతం 1068.90 అడుగుల నీరు నిల్వ ఉందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు.
Similar News
News February 7, 2025
NZB: ఆరుగురికి రెండు రోజుల జైలు శిక్ష
మద్యం తాగి వాహనాలు నడిపిన ఆరుగురికి 2 రోజుల చొప్పున జైలు శిక్ష విధించారని నిజామాబాద్ ట్రాఫిక్ సీఐ ప్రసాద్ తెలిపారు. నగరంలో నిన్న నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన 17 మందిని శుక్రవారం సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నూర్జహాన్ ముందు ప్రవేశపెట్టగా అందులో ఆరుగురికి రెండు రోజుల జైలు శిక్ష విధించారని చెప్పారు. మిగిలిన 11 మందికి రూ.15,500 జరిమానా విధించారన్నారు.
News February 7, 2025
NZB: మృత్యువులోనూ వీడని స్నేహం
నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనగర్ వద్ద నిన్న ఎదురెదురుగా <<15383679>>ఆటో, లారీ ఢీకొని<<>> మాక్లూర్‌కు చెందిన ఇద్దరు మృతిచెందిన సంగతి తెలిసిందే. ఈప్రమాదంలో మృతిచెందిన ఇంతియాజ్, వెల్డింగ్ పని చేసే ఫర్హాన్ ఇద్దరూ ప్రాణ స్నేహితులు అని మృతుల బంధువులు తెలిపారు. కాగా ఫర్హాన్‌కు వివాహమవగా 3నెలల పాప కూడా ఉందన్నారు.మృత్యువులోనూ వారి స్నేహం వీడలేదని కన్నీటి పర్యంతమయ్యారు.గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
News February 7, 2025
NZB: ఆస్తి పన్ను వసూలు చేయాలి: కమిషనర్
నిర్లక్ష్యం చేయకుండా నగరంలో ఆస్తి పన్ను వసూలు చేయాలని నిజామాబాద్ నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ ఆదేశించారు. ఆయన నగరపాలక సంస్థ స్పెషల్ టీం ఆఫీసర్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లు, వార్డు ఆఫీసర్లు, సపోర్టింగ్ సిబ్బందితో సమావేశమై ఆస్తిపన్ను విషయంలో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ భారీగా పెండింగ్లో ఉన్న వారి నుంచి త్వరితగతిన పన్ను వసూలు చేసేలా చూడాలన్నారు.