News March 28, 2025

NZB: TGRJC CETకు దరఖాస్తుల ఆహ్వానం

image

నిజామాబాద్ జిల్లాలోని గురుకుల కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరేందుకు 10వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని TGRJC CET నిజామాబాద్ జిల్లా కోఆర్డినేటర్ గంగా శంకర్ తెలిపారు. మార్చి 24 నుంచి ఏప్రిల్ 23 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. మే 25న జిల్లా కేంద్రంలో ప్రవేశ పరీక్ష ఉంటుందని తెలిపారు.

Similar News

News March 31, 2025

నిజామాబాద్ జిల్లా ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు: కలెక్టర్

image

రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా వేసవి తీవ్రతలోనూ నియమ నిష్ఠలతో దాదాపు నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు నిర్వర్తించడం ఎంతో గొప్ప విషయమన్నారు. అన్ని వర్గాల ప్రజలు సుఖః సంతోషాలతో కాలం వెళ్లదీయాలని, సౌభ్రాతృత్వం వెల్లివిరియాలని ఆకాంక్షించారు.

News March 31, 2025

నిజామాబాద్ జిల్లాలో దంచికొడుతున్న ఎండలు..

image

నిజామాబాద్ జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. ఆదివారం కోటగిరిలో 41℃, కమ్మరపల్లి, బోధన్, మెండోరా 40.9, పొతంగల్ 40.8, వేల్పూర్ 40.7, సాలూర, ఇందల్వాయి, డిచ్‌పల్లి 40.6, మక్లూర్, ఎడపల్లి, ఆర్మూర్ 40.5, ధర్పల్లి, నిజామాబాద్ 40.4, ముగ్పాల్ 40.4, నందిపేట్ 40.3, రెంజల్, మోస్రా 40.2, బోధన్లో 40.1℃ గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.కాగా ఈ ప్రాంతాలన్నీ ఆరెంజ్ జోన్‌లో ఉన్నాయి.

News March 30, 2025

NZB: బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో పంచాంగ శ్రవణం

image

బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా కార్యాలయంలో ఆదివారం పంచాంగ శ్రవణం నిర్వహించారు. జోషి మధుసూదన్ శర్మ విశ్వవసునామ సంవత్సరం ఎలా ఉండబోతుందోనని వివరించారు. కార్యక్రమంలో మాజీ మేయర్ దండు నీతూ కిరణ్, మాజీ నుడా చైర్మన్ ప్రభాకర్, జాగృతి అధ్యక్షుడు అవంతి శ్రీనివాస్, శంకర్, రామ్ కిషన్ రావు తదితరులతో పాటు మహిళా నాయకురాల్లు పాల్గొన్నారు.

error: Content is protected !!