News April 13, 2025
NZB: TU పరిధిలో 16 నుంచి జరిగే ప్రాక్టికల్ పరీక్షల బహిష్కరణ

తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో ఈ నెల 16నుంచి జరగబోయే ప్రాక్టికల్ పరీక్షలను బహిష్కరిస్తున్నట్లు నిజామాబాద్ జిల్లా ప్రయివేటు కళాశాలల యాజమాన్యాల అసోసియేషన్ ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా ఫీజు రీయింబర్స్మెంట్ విషయమై ప్రభుత్వ మొండి వైఖరికి నిరసన తెలియజేస్తూ బహిష్కరణే మార్గమని తలచి ఈ కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు రిజిస్ట్రార్‌కు బహిష్కరణ లేఖను పంపారు.
Similar News
News April 25, 2025
NZB: ఏడుగురికి ప్రమోషన్లు

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 7గురు పోలీస్ కానిస్టేబుల్‌ల్లకు హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి పొందారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వారిని అభినందించారు. అదేవిధంగా పోలీస్ కమిషనర్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ పదోన్నతి పొందిన కానిస్టేబుల్‌లు పూల మొక్క అందజేశారు. పదోన్నతి పొందిన వారిలో గంగ ప్రసాద్, ఉషా శేఖర్, భూమ్రాజ్, శ్రీనివాసరాజు, కృష్ణ, సయ్యద్ అఫ్జల్, kerbaaji ఉన్నారు.
News April 24, 2025
బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అరెస్ట్

బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ను పంజాగుట్ట పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ప్రగతి భవన్ ఎదుట గతంలో ఆయన కుమరుడు యాక్సిడెంట్ చేయగా.. పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. అనారోగ్య కారణాలతో షకీల్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో కుమారుడుని తప్పించి, మరొకరిని లొంగిపోయేలా చేశాడు. షకీల్‌కు సహకరించిన పోలీసులపై వేటుపడగా, కొడుకుతో కలిసి దుబాయ్‌కి వెళ్ళాడు. ఇటీవల తిరిగి వచ్చాడు.
News April 24, 2025
NZB: భూ సమస్యల పరిష్కారానికి నూతన చట్టం: కలెక్టర్

భూభారతి చట్టం ద్వారా రైతుల, ప్రజల సమస్యలు తీరుతాయని కలెక్టర్ తెలిపారు. రైతులకు, ప్రజలకు చేకూరే ప్రయోజనాలు, చట్టంలో పొందుపర్చిన కీలక అంశాల గురించి భీంగల్‌లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ధరణి రికార్డులను భూభారతిలో నమోదు చేస్తామని వెల్లడించారు. ఎవరికైనా భూముల రికార్డుల విషయంలో తప్పులు ఉంటే, ఈ చట్టం అమలులోకి వచ్చిన ఏడాది కాలంలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.