News March 18, 2024
NZB: జంట హత్యలు.. నిందితుడు సూసైడ్

ఆర్మూర్‌లోని విద్యానగర్ కాలనీలో చేపూర్ గ్రామానికి చెందిన బండి నడిపి గంగాధర్ అనే వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు గతంలో నగల కోసం ఇద్దరూ అక్కాచెల్లెళ్లను హతమార్చిన ఘటనలో నిందితుడు కావడం విశేషం. మృతుడి ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అప్పటినుంచి మతిస్థిమితం లేదని మృతుడి బంధువులు తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు.
Similar News
News February 9, 2026
NZB: ఎలక్షన్ ఎఫెక్ట్.. 162 మంది బైండోవర్

నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, భీమ్‌గల్ పరిధిలో 162 మందిని సంబంధిత తహశీల్దార్ల ఎదుట హాజరు పరిచి బైండోవర్ చేసినట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. అలాగే ఎన్నికల ప్రవర్తన నియమా నియమావళిని ఉల్లంఘించిన వారిపై టౌన్-1, టౌన్-3, బోధన్, భీమ్‌గల్, ఆర్మూర్ పోలీస్ స్టేషన్లలో ఐదు కేసులు నమోదు చేసినట్లు వివరించారు.
News February 9, 2026
NZB: 1,500 మంది సిబ్బందితో బందోబస్తు: సీపీ

నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, భీమ్‌గల్ పరిధిలో ఎన్నికల నేపథ్యంలో 1,500 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. 3 ప్లాటున్ల TSSP సిబ్బంది , స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఏర్పాటు చేశామన్నారు.
News February 9, 2026
NZB: మున్సిపల్ ఎన్నికలను సజావుగా నిర్వహించాలి: కలెక్టర్

మున్సిపల్ ఎన్నికలను సజావుగా నిర్వహించాలని NZB కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు సూచించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ నుంచి హాజరైన సెక్యూర్ సెల్ ఆఫీసర్ మంద మకరంద్‌తో కలిసి కలెక్టర్ సోమవారం సాయంత్రం నగరపాలక సంస్థ కార్యాలయంలో అధికారులతో ఎన్నికల ఏర్పాట్లపై చర్చించారు. ఎన్నికల సామగ్రి పంపిణీకి చేపట్టిన చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు.


