News February 5, 2025
NZB: UPDATE.. రైలు నుంచి పడిన మృతుడి గుర్తింపు: SI

నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం సిర్నాపల్లి – ఉప్పల్వాయి స్టేషన్‌ల మధ్య రైలు నుంచి జారి పడి నిన్న సాయంత్రం ఒకరు మృతి చెందిన సంగతి తెలిసిందే. కాగా మృతుడిని మేడ్చల్ కు చెందిన చిట్యాల భూంరెడ్డి (80) గా గుర్తించినట్లు నిజామాబాద్ రైల్వే ఎస్ఐ సాయిరెడ్డి తెలిపారు. మృతుడు ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ రైల్లో నుంచి జారి పడినట్లు ఎస్ఐ వివరించారు.
Similar News
News February 8, 2026
GWL: 140 మంది బైండోవర్.. 9 ఆయుధాలు స్వాధీనం: ఎస్పీ

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో గద్వాల జిల్లాలో 140 మందిని ముందస్తు బైండోవర్ చేసినట్లు ఎస్పీ శ్రీనివాసరావు ఆదివారం తెలిపారు. గత ఎన్నికల్లో నేరాలకు పాల్పడ్డ వారిని గుర్తించి 73 మెమోలు జారీ చేశామన్నారు. జిల్లాలో లైసెన్స్ కలిగిన వెపన్స్ 17 ఉండగా, 9 స్వాధీనం చేసుకోగా 8 బ్యాంకుల్లో గాడ్స్ వద్ద రక్షణ నిమిత్తం మినహాయింపు ఇచ్చామన్నారు. 23 కేసుల్లో రూ.1.96 లక్షల విలువైన మద్యం స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
News February 8, 2026
NTR జిల్లాలో 42 డ్రోన్లతో నిఘా

ఎన్‌టీఆర్ జిల్లాలో నేరాల నియంత్రణకు పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర బాబు 42 డ్రోన్లతో నిఘా వ్యవస్థను ప్రారంభించారు. శాంతిభద్రతల కోసం 28, ట్రాఫిక్ కోసం 14 డ్రోన్లను వినియోగిస్తున్నారు. వీటి ద్వారా అసాంఘిక కార్యకలాపాలు, విఐపి బందోబస్తును పర్యవేక్షించనున్నారు. డ్రైవింగ్ చేస్తూ సెల్‌ఫోన్ వాడే వారిని కూడా ఈ డ్రోన్ల ద్వారా గుర్తిస్తామని పోలీసులు హెచ్చరించారు.
News February 8, 2026
2030లో కూలిపోనున్న ISS!

ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు వీడ్కోలు పలికే సమయం ఆసన్నమైందని NASA చెబుతోంది. 1998లో స్పేస్‌లోకి అడుగు పెట్టిన ISSని 2030లో పసిఫిక్ మహా సముద్రంలో కూల్చేయనున్నారు. ఈ బాధ్యతను ‘Space X’కు అప్పగించింది. భూభాగానికి వేల KM దూరంలోని ‘పాయింట్ నీమో’లో కూలుస్తారు. ఇయర్లీ మెయింటినెన్స్ పెరగడం, అనుకున్న దానికంటే ఎక్కువ కాలమే స్పేస్‌లో ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.


