News March 13, 2025

NZB: UPDATE.. ACB సోదాల్లో లెక్క చూపని నగదు స్వాధీనం

image

NZB <<15734537>>రవాణా శాఖ కార్యాలయంలో భారీగా వసూళ్లు జరుగుతున్న వైనాన్ని ఏసీబీ<<>> అధికారులు గుర్తించారు. బుధవారం సుదీర్ఘంగా జరిపిన సోదాల్లో ఏజెంట్ ఖలీల్ నుంచి రూ.27వేల లెక్కచూపని నగదు స్వాధీనం చేసుకున్నారు. అలాగే అతడి నుంచి 14 వాహనాలకు సంబంధించిన ఒరిజినల్ ఆర్సీ పత్రాలను, ముగ్గురు వ్యక్తుల డ్రైవింగ్ లైసెన్స్లను జప్తు చేశారు. ఎవరెవరు వసూళ్లకు పాల్పడుతున్నారనే విషయమై విచారణ చేస్తున్నట్లు అధికారులు వివరించారు.

Similar News

News March 13, 2025

అనంతపురం కోర్టులో నారా లోకేశ్‌పై ఫిర్యాదు 

image

అనంతపురం కోర్టులో మంత్రి నారా లోకేశ్‌పై వైసీపీ నేత చవ్వా రాజశేఖర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ మంత్రులు రోజా, విడదల రజిని ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టులు చేస్తున్నారని తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, దీంతో న్యాయం కోసం కోర్టును ఆశ్రయించామన్నారు. ఆ పోస్టుల వెనుక లోకేశ్ ఉన్నారని ఆరోపించారు.

News March 13, 2025

అనకాపల్లిలో స్వర్ణాంధ్ర-స్వచ్ఛ ఆంధ్రపై సమీక్ష

image

అనకాపల్లి కలెక్టరేట్‌లో గురువారం స్వర్ణాంధ్ర-స్వచ్ఛ ఆంధ్రపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ విజయకృష్ణన్ మాట్లాడుతూ.. ఈనెల 15వ తేదీన నిర్వహించే శుభ్రత కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. ఈ మేరకు గోడపత్రిలు కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డివిజన్, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

News March 13, 2025

ఇలా చదివితే ఈజీగా గుర్తుంటాయ్!

image

ఇది పరీక్షల సమయం. సిస్టమేటిక్‌గా చదువుకుంటే ఈజీగా పరీక్షలు రాయొచ్చు. దీనికి పోమోడోర్ టెక్నిక్‌ (టైమ్ మేనేజ్‌మెంట్) ఎంతో యూజ్‌ఫుల్ అని నిపుణులు చెబుతున్నారు. ‘చదవాల్సిన విషయాన్ని ఎంచుకోండి. దీనికోసం టైమర్‌ని 25 ని.లకు సెట్ చేసుకోండి. టైమర్ పూర్తవగానే ఓ 10 ని.లు బ్రేక్ ఇవ్వండి. నాలుగు సార్లు ఇలా చేశాక 30 ని.లు బ్రేక్ తీసుకోండి. ఇలా చేస్తే దృష్టి మెరుగై పరధ్యానం తగ్గుతుంది’ అని తెలిపారు. SHARE IT

error: Content is protected !!