News March 23, 2025
NZB: అంతర్జాతీయ పోటీలకు విద్యార్థిని ఎంపిక

భారత అండర్-15 సబ్ జూనియర్ సాఫ్ట్ బాల్ పోటీలకు జిల్లాకు చెందిన విద్యార్థిని ఎంపికైంది. ఈ నెల 25వ తేదీ నుంచి 30 వరకు తైవాన్‌లో జరిగే సాఫ్ట్ బాల్ పోటీల్లో డిచ్‌పల్లి మండలం సుద్దులం గురుకుల పాఠశాలకు చెందిన గన్న హర్షిని పాల్గొననుంది. ఈ సందర్భంగా క్రీడాకారిణిని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు వినోద్, తిరుపతి పాల్గొన్నారు.
Similar News
News February 11, 2026
NZB: గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

నిజామాబాద్ నాగారం సమీపంలో నందిగుట్ట వద్ద ఉన్న చెరువు సమీపంలో బుధవారం ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు 5వ టౌన్ పోలీస్ స్టేషన్ SI ఎం.గంగాధర్ తెలిపారు. సుమారు 35-40 ఏళ్ల వ్యక్తి తామర పూల కోసం చెరువులోకి వెళ్లి మృతి చెందినట్లు అనుమానిస్తున్నారు. అతని వద్ద ఎలాంటి గుర్తింపు ఆధారాలు లభించలేదన్నారు. మృతుడిని గుర్తిస్తే 8712659727 నంబర్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు.
News February 11, 2026
NZB: మధ్యాహ్నం 3 గంటల వరకు 48.55 శాతం పోలింగ్

నిజామాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మధ్యాహ్నం 3 గంటల వరకు 48.55 శాతం పోలింగ్ నమోదైంది. NZB కార్పొరేషన్ లో 43.18శాతం, ఆర్మూర్ మున్సిపాలిటిలో 60.05 శాతం, బోధన్‌లో 61.77 శాతం, భీమ్‌గల్ మున్సిపాలిటీలో 63.65 శాతం పోలింగ్ నమోదైంది. జిల్లాలో 4,95,485 మంది ఓటర్లకు గాను ఇప్పటి వరకు 2,40,543 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని అధికారులు తెలిపారు.
News February 11, 2026
NZB: వృద్ధుడికి సాయం చేసిన పోలీస్ బాస్

ప్రజాస్వామ్య పండుగలో ఓటు వేయడానికి వచ్చిన ఓ వృద్ధుడికి జిల్లా పోలీస్ బాస్ అండగా నిలిచారు. బుధవారం నిజామాబాద్‌లో పోలింగ్ సరళిని పర్యవేక్షిస్తున్న క్రమంలో సీపీ పి.సాయి చైతన్య తనలోని మానవీయ కోణాన్ని చాటుకున్నారు. చంద్రశేఖర్ కాలనీలోని పోలింగ్ కేంద్రం వద్ద నడవలేని స్థితిలో ఉన్న ఓ వృద్ధుడిని చూసిన ఆయన స్వయంగా వీల్ ఛైర్‌ను నెట్టుకుంటూ వెళ్లి సదరు వృద్ధుడు ఓటు వేయడానికి సహకరించారు.


