News April 2, 2025

NZB: ఆత్మహత్య.. చికిత్స పొందుతూ మృతి

image

నిజామాబాద్ రూరల్ మండలంలోని ఆకుల కొండూరులో ఓ యువకుడు ఆన్‌లైన్ గేమ్స్‌లో డబ్బులు పోగొట్టుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాలు.. గ్రామానికి చెందిన ఆకాశ్(24) ఆన్‌లైన్లో డబ్బులు పెట్టి గేమ్స్ ఆడాడు. అందులో దాదాపుగా రూ.5లక్షల వరకు పోగొట్టుకున్నాడు. ఇంట్లో వారికి తెలిస్తే కోప్పడతారని గడ్డి మందు తాగాడు. మంగళవారం చికిత్స పొందుతూ మృతి చెందాడు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Similar News

News April 4, 2025

భద్రాచలం వెళ్తుండగా.. కాలు నుజ్జునుజ్జయింది..!

image

అశ్వారావుపేట మండలం అసుపాక సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆంధ్రప్రదేశ్ చాగల్లు ప్రాంతానికి చెందిన భక్తులు శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలానికి పాదయాత్రగా వెళ్తున్నారు. అలసటగా ఉండి భద్రాచలం వైపు వెళ్తున్న ట్రాక్టర్‌పై ఎక్కారు. నందిపాడు సమీపంలో అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మంజు అనే యువతికి కాలు నుజ్జు నుజ్జు అయ్యింది. పలువురికి గాయాలు కావడంతో ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

News April 4, 2025

‘ఇంపాక్ట్’ చూపించి SRHను ఓడించాడు

image

IPL: కోల్‌కతాతో నిన్న జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన హైదరాబాద్‌ను KKR ఇంపాక్ట్ ప్లేయర్ వైభవ్ అరోరా కోలుకోలేని దెబ్బతీశారు. ముగ్గురు విధ్వంసకర ఆటగాళ్లు హెడ్, ఇషాన్ కిషన్, క్లాసెన్ వికెట్లు పడగొట్టి హైదరాబాద్ ఓటమిని శాసించారు. POTM అవార్డు సొంతం చేసుకున్నారు. SRH హ్యాట్రిక్ పరాజయాలను మూటగట్టుకుంది.

News April 4, 2025

రాములోరి కళ్యాణానికి పకడ్బందీ ఏర్పాట్లు: భద్రాద్రి ఎస్పీ

image

ఈనెల 6, 7 తేదీల్లో భద్రాచలంలో జరగనున్న శ్రీరామనవమి, పట్టాభిషేక మహోత్సవానికి ఇతర శాఖల అధికారులతో సమన్వయం పాటిస్తూ భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పోలీస్ శాఖ తరఫున పటిష్టమైన చర్యలు చేపట్టామని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. పార్కింగ్ స్థలాలు, కళ్యాణ మంటపం, సెక్టార్లు, లడ్డూ, తలంబ్రాల కౌంటర్ వద్దకు సులభంగా వెళ్లేందుకు QR కోడ్, ఆన్‌లైన్ లింక్ రూపొందించినట్లు పేర్కొన్నారు.

error: Content is protected !!