News February 18, 2025
NZB: ఆరుగురి హత్య.. కోర్టు సంచలన తీర్పు

నిజామాబాద్ జిల్లాలో 2023లో సంచలనం రేపిన ఆరుగురి హత్య కేసులో జిల్లా కోర్డు సంచలన తీర్పు ఇచ్చింది. ప్రశాంత్, అతని తల్లి వడ్డేమ్మకు జీవిత ఖైదు విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల తీర్పును వెలువరించారు. 2023లో మాక్లూర్ మండల కేంద్రంలో ప్రసాద్ కుటుంబానికి చెందిన ఆస్తిని అతని స్నేహితుడు ప్రశాంత్ కాజేసేందుకు కుట్ర చేశాడు. ఇందుకు ఆరుగురిని హత్య చేశాడు.
Similar News
News February 21, 2025
డిచ్పల్లి: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి, ఇద్దరికి గాయాలు

డిచ్పల్లి మండలం బీబీపూర్ తండా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఇద్దరు గాయపడ్డారు. నిజామాబాద్ నగరానికి చెందిన హఫీజ్ సయ్యద్ అయుబ్, మౌలానా మొయినుద్దీన్, హఫీజ్ షాహెద్ రజా, అబ్దుల్ రెహ్మన్ ముషిరాబాద్లో జరిగిన మతపరమైన కార్యక్రమానికి వెళ్లారు. గురువారం రాత్రి తిరిగి వస్తుండగా బీబీపూర్ తండా వద్ద జాతీయ రహదారిపై వీరి కారును గుర్తు తెలియని వాహనం ఢీకొనగా కారు బోల్తా పడి రెహమాన్ మృతి చెందాడు.
News February 21, 2025
ఆర్మూర్: ప్రమాదవశాత్తు నిప్పు అంటుకొని ఒకరు మృతి

ప్రమాదవశాత్తు డేరాకు నిప్పంటుకుని వృద్ధుడు సజీవ దహనమైన విషాద ఘటన ఆర్మూర్‌లో జరిగింది. మృతుడు సీతారామారావుగా (75) గుర్తించారు. మృతుడు కాలిన గాయాలతో మృతి చెందినట్లు పేర్కొన్నారు. గత కొన్ని సంవత్సరాల నుంచి పక్షవాతంతో బాధపడుతున్నాడు. కొడుకు రామేశ్వర్ రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
News February 21, 2025
NZB: దారి దోపిడీకి పాల్పడ్డ ముగ్గురు అరెస్ట్

నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తపేట నిజాంసాగర్ కెనాల్ వద్ద దారిదోపిడికి పాల్పడ్డ విషయం తెలిసిందే. ఈ ఘటనపై పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే బిహార్‌కు చెందిన ముగ్గురు స్థానికంగా ఉండే రైస్ మిల్లులో పనిచేస్తూ, ఈ దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. బాధితుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు, ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.