News December 30, 2024

NZB: ఈ ఏడాది క్రైమ్ రేట్ వివరాలు ఇలా..

image

NZB జిల్లాలో ఈ ఏడాదికి సంబంధించిన కేసుల వివరాలను ఇన్ ఛార్జ్ CP సింధు శర్మ వెల్లడించారు. శారీరక నేరాలు, ఆస్తి నేరాలు గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది కాస్త ఎక్కువే అయ్యాయి. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ, మృతి చెందిన కేసులు, సైబర్ నేరాలు, పోక్సో, మిస్సింగ్, గేమింగ్ ఆక్ట్ కేసులు కూడా ఎక్కువగానే నమోదయ్యాయి. గతేడాది 356 ఆత్మహత్యలు జరగగా ఈ యేడు 442 జరిగాయి. గాంజా కేసులు 22 నమోదు కాగా 58 మందిని అరెస్ట్ చేశామన్నారు.

Similar News

News January 4, 2025

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థాయి సైన్స్ క్విజ్ పోటీ

image

మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా విద్యార్థులకు శనివారం నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థాయి సైన్స్ క్విజ్ -2025 పోటీ నిర్వహించారు. గెలుపొందిన వారికి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ నిజామాబాద్ డివిజన్ డిప్యూటీ కమిషనర్ వి.సోమిరెడ్డి, ఎక్సైజ్ సూపరింటెండెంట్లు మల్లారెడ్డి, హనుమంతురావు, ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ చంద్రభాన్ బహుమతులు అందించారు.

News January 4, 2025

NZB: విద్యార్థులు డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి: రాజురెడ్డి

image

విద్యార్థులు డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని కాకతీయ సాండ్ బాక్స్ వ్యవస్థాపకులు రాజు రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు ఉన్నత ఆశయాలను లక్ష్యాలుగా ఎంచుకోవాలని సూచించారు. నిజామాబాద్ అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ బస్వారెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు డ్రగ్స్ వల్ల కలిగే అనార్థాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. తన చుట్టూ ఉన్న వారిని చైతన్యం చేయాలని కోరారు.

News January 4, 2025

KMR: అదనపు కట్నం కోసం హత్య.. భర్తకు జీవిత ఖైదు

image

అదనపు కట్నం కోసం భార్యను హత్య చేసిన భర్త రమావత్ రమేశ్‌కు జీవిత ఖైదు విధిస్తూ శుక్రవారం కామారెడ్డి ప్రధాన న్యాయమూర్తి వర ప్రసాద్ తీర్పునిచ్చారు. జిల్లాలోని సురాయిపల్లి తండాకు చెందిన రమేశ్ భార్యను అదనపు కట్నం కోసం వేధిస్తూ 2021 ఫిబ్రవరి 27న లింగంపేట్ బస్టాండ్‌లో కొట్టాడు. గాయపడినా ఆమె నిజామాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. నేరం రుజువుకావడంతో జీవిత ఖైదు విధించారు.