News April 4, 2025

NZB: ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య

image

నిజామాబాద్ నగరంలోని గాయత్రీ నగర్‌లో ఎర్రమల పవన్ రాజు(25) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు 4వ టౌన్ ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. మృతుడు నగరంలోని ఒక బట్టల షాపు వేర్ హౌస్‌లో పని చేసేవాడు. అక్కడ పని చేసే అతడి స్నేహితురాలు వ్యక్తిగత కారణాలతో మృతి చెందగా నాటి నుంచి మానసికంగా కుంగిపోయాడు. ఈ నేపథ్యంలో ఆత్మహత్య చేసుకోగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు.

Similar News

News April 14, 2025

NZB: దళితులను అవమానించడమే ప్రజా పాలనా?: కవిత

image

దళితులను అవమానించడమే ప్రజా పాలనా? అని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత X లో ప్రశ్నించారు. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలో అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల విషయంలో దళితులపై పోలీసుల దమనకాండను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. బట్టలు విప్పి దళితులను అరెస్టు చేసిన పోలీసులను తక్షణమే సస్పెండ్ చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నానన్నారు.

News April 14, 2025

SRSP సాగునీటి విడుదల నిలిపివేత

image

శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి నీటి విడుదలను అధికారులు నిలిపివేశారు. యాసంగి పంట కాలం పూర్తి కావడంతో నీటి విడుదల సోమవారం నిలిపివేసినట్లు డ్యామ్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కొత్త రవి తెలిపారు. గత ఏడాది డిసెంబర్ 25 నుంచి ఈ నెల 9 వరకు ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్ట్​ పూర్తి నీటిమట్టం 80.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 11.44 టీఎంసీల నీటి నిల్వ ఉందని తెలిపారు.

News April 14, 2025

NZB: పిల్లలపై నిరంతరం అప్రమత్తంగా ఉండండి

image

మరికొద్ది రోజుల్లో విద్యార్థులకు 2 నెలల వేసవి సెలవులు రానున్నాయి. దీంతో సెలవుల్లో పిల్లలు నదులు, చెరువుల్లో ఈత కొట్టడానికి వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకునే అవకాశం ఉంది. తల్లిదండ్రులు పిల్లల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి. వారిపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలి. అలాగే ఎండలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో పిల్లలు బయటకు వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.

error: Content is protected !!