News January 13, 2025
NZB: ఊరు వాడా ఘనంగా భోగి సంబురం
ఉమ్మడి NZB జిల్లాల్లో సంక్రాంతి సంబురాలు షురూ అయ్యాయి. మూడు రోజుల వేడుకల్లో భాగంగా తొలి రోజు సోమవారం భోగి పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఊరు వాడా జనం పొద్దున్నే లేచి భోగి మంటలు వేసుకున్నారు. తమ ఇండ్ల ముందు యువతులు, చిన్నారులు రంగు రంగుల ముగ్గులు వేస్తూ..సందడి చేశారు. అటు యువకులు ఒకరితో ఒకరు పోటీ పడి మరీ గాలి పటాలు ఎగురవేస్తూ..ఎంజాయ్ చేస్తున్నారు.
Similar News
News January 14, 2025
భీమ్‌గల్: సెల్ఫీ వీడియోపై స్పందించిన ఎస్ఐ
భీమ్‌గల్ మండలం చేంగల్ గ్రామానికి చెందిన తక్కూరి నికేష్ సెల్ఫీ వీడియోపై ఎస్ఐ మహేశ్ స్పందించారు. అతని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా పలుమార్లు స్టేషన్‌కు పిలిచినా రాలేదన్నారు. తప్పించుకు తిరుగుతూ పోలీసులపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వివరించారు. ఎవరి ప్రోద్బలంతో హింసించ లేదని, అతని ఆరోపణలు అవాస్తవమన్నారు. ఈ మేరకు ఎస్ఐ మహేశ్ ఓ ప్రకటనలో తెలిపారు.
News January 14, 2025
NZB: మీ ముచ్చటైన ముగ్గులు Way2Newsలో
సంక్రాంతి, కనుమ సందర్భంగా మీ వాకిట్లో వేసిన మీ ముగ్గులనూ Way2Newsలో చూడాలనుకుంటే 7331149141 నంబర్‌కు వాట్సాప్ చేయండి. నోట్: ఫొటో, మీ పేరు, గ్రామం, మండలం, జిల్లా పేర్లు ఖచ్చితంగా పంపగలరు. పండుగను ప్రతిబింబించే ముగ్గులు మాత్రమే (వాట్సాప్ పోస్టు) పబ్లిష్ అవుతాయి.
News January 13, 2025
NZB: జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్‌గా పల్లె గంగారెడ్డి
జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్‌గా నిజామాబాద్ జిల్లాకు చెందిన బీజేపీ సీనియర్ నేత పల్లె గంగారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు భారత ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిలో ఆయన మూడేళ్ల పాటు కొనసాగనున్నారు. పల్లె గంగారెడ్డి ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా కొనసాగుతున్నారు. గతంలో బీజేపీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా పని చేశారు.