News February 18, 2025

NZB: ఎస్ఐని ఢీకొని పరారైన కారు

image

వాహనాలు తనిఖీ చేస్తున్న ఎస్ఐను ఓ వ్యక్తి కారుతో ఢీకొని పరారైన ఘటన NZBలో చోటు చేసుకుంది. సోమవారం రాత్రి RR చౌరస్తాలో 4వ టౌన్ ఎస్ఐ-2 ఉదయ్ వాహనాల తనిఖీ చేస్తుండగా ఓ కారు వేగంగా వచ్చి ఆయణ్ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఎస్ఐకి గాయాలయ్యాయి. సిబ్బంది ఎస్ఐని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ వాహనం ఆపకుండా పరారయ్యాడు. కేసు నమోదు చేసినట్లు 4వ టౌన్ ఎస్‌ఐ శ్రీకాంత్ తెలిపారు.

Similar News

News March 12, 2025

NZB: ఆర్టీఏ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు

image

నిజామాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో ఏసీబీ అధికారుల బృందం బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి తనిఖీలు చేపడుతోంది. ప్రధాన గేటుకు తాళం వేసి సోదాలు చేస్తున్నారు. పలువురు ఏజెంట్లు లోపల ఉండగా ఈ దాడి జరిగింది. కాగా ఈ కార్యాలయం పరిధిలో పలువురు అధికారులు ఏజెంట్ల ద్వారా పెద్ద ఎత్తున వసూళ్లు చేస్తున్నట్లు ఫిర్యాదులు వెళ్లిన నేపథ్యంలోనే ఏసీబీ డీఎస్పీ ఆధ్వర్యంలో సోదాలు జరుపుతున్నట్లు తెలిసింది.

News March 12, 2025

NZB: గ్రూప్-2లో BC(A) విభాగంలో SIకి స్టేట్ ఫస్ట్ ర్యాంక్

image

నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి ఏడవ బెటాలియన్ రిజర్వ్‌డ్ ఎస్సై BC(A) లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించారు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం, లింగాపూర్ గ్రామానికి చెందిన వరంగంటి అశోక్ నాలుగేళ్లుగా డిచ్పల్లి ఏడవ బెటాలియన్‌లో SIగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే నిన్న విడుదలైన గ్రూప్-2 ఫలితాల్లో బీసీఏలో స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించారు.

News March 12, 2025

ఆర్మూర్: గ్రూప్స్ ఫలితాలలో సత్తా చాటిన పెర్కిట్ వాసి

image

ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ ప్రాంతానికి చెందిన రామ్ కిషోర్ గ్రూప్స్ ఫలితాల్లో సత్తా చాటారు. రాష్ట్రస్థాయిలో గ్రూప్-2 ఫలితాలలో 136వ ర్యాంక్ సాధించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ విధులు నిర్వహిస్తున్నారని తల్లిదండ్రులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలియజేసి అభినందించారు.

error: Content is protected !!