News January 18, 2025
NZB: ఏడు నెలల కిందట మిస్సింగ్.. ఇప్పుడు ఎముకలు లభ్యం

ఏడు నెలల కిందట అదృశ్యమైన మహిళ ఎముకలు లభ్యమయ్యాయి. ఈ ఘటన మోపాల్ మండలంలో శనివారం వెలుగులోకి వచ్చింది. మండలానికి చెందిన విజయ ఏడు నెలల కిందట అదృశ్యమైంది. అయితే రెండు రోజుల కిందట కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు శనివారం మంచిప్ప ప్రాంతంలోని ఒక కల్వర్టు కింద మహిళ ఎముకలను గుర్తించారు. ఘటన స్థలాన్ని ACP రాజ వెంకటరెడ్డి, CI సురేశ్, SI యాదగిరి గౌడ్ పరిశీలించారు.
Similar News
News March 13, 2025
ప్రభుత్వ సేవలకు లబ్ధిదారుల్లో సంతృప్తి ఉండాలి: కలెక్టర్

మహిళా సంఘాల సభ్యులతో ఎంఎస్ఎమ్ఈల ఏర్పాటుకు డీపీఆర్‌లు రూపొందించాలని కలెక్టర్ పీ.రంజిత్ బాషా సంబంధిత శాఖల అధికారులను బుధవారం ఆదేశించారు. కర్నూలు కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్లో సీఎం అధ్యక్షతన నిర్వహించిన కాన్ఫరెన్స్‌లో చర్చించిన అంశాలు, తీసుకున్న చర్యలపై జిల్లా అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ సేవలకు సంబంధించి లబ్ధిదారుల్లో సంతృప్తి ఉండాలని సూచించారు.
News March 13, 2025
వరంగల్ మార్కెట్లో మిర్చి ఉత్పత్తుల ధరలు ఇలా.!

వరంగల్ నగరంలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో అరుదైన మిర్చి ఉత్పత్తుల ధరలు ఇలా ఉన్నాయి. దీపిక మిర్చి క్వింటాకి రూ.16,500 పలకగా, 5531 రకం మిర్చికి రూ. 11,000 ధర వచ్చింది. అలాగే 1048 మిర్చికి రూ.11 వేలు, టమాటా మిర్చికి రూ.32వేలు, సింగిల్ పట్టి మిర్చికి రూ.37000 ధర వచ్చినట్లు వ్యాపారులు పేర్కొన్నారు.
News March 13, 2025
పేదల గృహ నిర్మాణాల కోసం అదనపు ఆర్థిక సహాయం: కలెక్టర్

అనకాపల్లి జిల్లాలో అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణం పూర్తి చేయుటకు రాష్ట్ర ప్రభుత్వం అదనపు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. అదనపు ఆర్థిక సహాయం వినియోగించుకొని ఇంటి నిర్మాణాలను పూర్తిచేసుకోవాలని ఆమె కోరారు. బుధవారం కలెక్టరేట్లో ఆమె మాట్లాడుతూ.. 2029 నాటికి అందరికీ ఇల్లు నిర్మించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉందన్నారు.