News February 14, 2025

NZB: ఒంటరి మహిళ మెడలోంచి గొలుసు అపహరణ

image

NZBలో ఒంటరిగా ఉన్న ఓ వృద్ధురాలి మెడలో నుంచి దుండగుడు బంగారు గొలుసును అపహరించుకు వెళ్లాడు. ఈ ఘటన గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. వీక్లీ మార్కెట్‌కు చెందిన విజయ ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. ఇదే అదునుగా భావించిన దుండగుడు ఇంట్లోకి ప్రవేశించి మహిళ మెడలో నుంచి మూడున్నర తులాల బంగారు గొలుసును లాక్కొని పారిపోయాడు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వన్ టౌన్ ఎస్ఐ మొగులయ్య తెలిపారు.

Similar News

News February 20, 2025

దళిత బంధు నిధులను విడుదల చేయాలి: MLC కవిత

image

దళితబంధు నిధులను బడ్జెట్ లోపు విడుదల చేయాలని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. గురువారం తన నివాసంలో జరిగిన దళిత బంధు సాధన సమితి సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఇప్పటికే కేసీఆర్ మంజూరు చేసిన దళిత బంధు నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మిగిలిన 18 వేల దళిత కుటుంబాలకు దళిత బంధు డబ్బులను విడుదల చేయాలని సవాలు చేశారు.

News February 20, 2025

NZB: పంటల విక్రయాలను పర్యవేక్షించాలి: కలెక్టర్

image

ఎర్రజొన్న, తెల్లజొన్న, పసుపు పంటల అమ్మకాలు ప్రారంభమైనందున క్రయవిక్రయాలను నిశితంగా పర్యవేక్షించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. పంట దిగుబడులను విక్రయించే విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ట్రేడర్లు, సీడ్ వ్యాపారులు మార్కెట్ రేటుకు అనుగుణంగా ధరను చెల్లిస్తూ రైతుల వద్ద నుంచి పంటను సేకరించేలా చూడాలన్నారు.

News February 20, 2025

నిజామాబాద్: రాష్ట్రంలో BRS అధికారంలోకి రావడం కలనే: మహేశ్

image

తెలంగాణలో ఇక BRS అధికారంలోకి రావడం కలనే అని, రెండోసారి కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని TPCC అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. గురువారం ఆయన నిజామాబాద్‌లో మాట్లాడుతూ.. BRS, BJP నాయకులు చేస్తున్న ఆరోపణలను ఖండించారు. ప్రతిపక్ష లీడర్ హోదాను KCR.. KTR, హరీశ్‌రావ్‌కు అప్పగించాలన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి రావడం ఖాయమని స్పష్టం చేశారు. 

error: Content is protected !!