News August 6, 2024

NZB: కస్టమర్ కేర్ నంబర్‌కు ఫోన్ చేస్తే.. రూ.96 వేలు మాయం

image

కస్టమర్ కేర్ నంబర్‌కు ఫోన్ చేసిన వ్యక్తి బ్యాంక్ అకౌంట్లో నుంచి సైబర్ నేరగాళ్లు డబ్బులు కాజేసిన వైనమిది. జిల్లాలోని ధర్పల్లి మండలం దుబ్బాక గ్రామానికి చెందిన గంగాధర్ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కస్టమర్ కేర్ నంబర్ కోసం గూగుల్లో సెర్చ్ చేసి ఫోన్ చేశాడు. వెంటనే అతడి ఖాతా నుంచి సైబర్ నేరగాళ్లు రూ.96 వేలు కాజేశారు. మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.

Similar News

News February 6, 2025

NZB: రైలులోంచి పడి యువకుడు మృతి

image

రైల్లోంచి పడి గుర్తుతెలియని యువకుడు మృతి చెందినట్లు నిజామాబాద్ రైల్వే ఎస్ఐ సాయి రెడ్డి తెలిపారు. NZB- జానకంపేట రైల్వే స్టేషన్ మధ్యలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. రైల్లోంచి కింద పడడంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి మృతదేహాన్ని పంచనామా నిమిత్తం మార్చురీకి తరలించారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 8712658591 నంబర్‌‌‌కు సంప్రదించాలన్నారు.

News February 6, 2025

జక్రాన్‌పల్లి: విలువైన నిషేదిత మత్తు పదార్థాల దహనం

image

నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలో 154 కేసులలో పట్టుబడిన రూ.12కోట్ల విలువైన నిషేదిత మత్తు పదార్థాలను జక్రాన్పల్లిలోని శ్రీ మెడికేర్‌లో గురువారం దహనం చేశారు. ఈ మేరకు డ్రగ్ డిస్పోజల్ కమిటీ అమోదించిన నిషేదిత మత్తు పదార్థాలైన 1700 కిలోల ఎండు గంజాయి, 64.27 కిలోల అల్ఫాజోలం, 72.2 కిలోల డైజీపాం, ఒక గంజాయి మొక్కను దహనం చేశారు. కార్యక్రమంలో ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు. 

News February 6, 2025

NZB: ఉపాధ్యాయులకు డీఈవో నోటీసులు 

image

సమయానికి పాఠశాలకు హాజరు కాని నలుగురు ఉపాధ్యాయులకు డీఈవో అశోక్ షోకాజ్ నోటీసులను జారీ చేశారు. గురువారం నిజామాబాద్ వినాయకనగర్ ప్రాథమికోన్నత పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. ఆ సమయంలో టీచర్లు రాకపోవడంతో నోటీసులు ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పాఠశాల సమయానికి ఉపాధ్యాయులు తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించడంతోపాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు.

error: Content is protected !!