News January 7, 2025
NZB: కాంగ్రెస్ రాష్ర్ట వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షీ రాక
నిజామాబాద్ పార్లమెంట్ స్థాయి కాంగ్రెస్ పార్టీ విస్తృత సమావేశం మంగళవారం మధ్యాహ్నం డిచ్పల్లిలో నిర్వహించనున్నట్లు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షీ, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరు కానునున్నట్లు వివరించారు.
Similar News
News January 9, 2025
కోటగిరి: రెండు బైకులు ఢీ ఒకరు మృతి
కోటగిరి నుంచి ఎత్తోండ వెళ్లే రోడ్డుపై బుధవారం రెండు బైకులు ఢీ కొనడంతో లక్ష్మణ్(55) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. లక్ష్మణ్ తన పొలం నుంచి కోటగిరికి తిరిగి వెళ్తుండగా మరో వ్యక్తి కోటగిరి నుంచి ఎత్తోండ వెళ్లే క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఎత్తోండకు చెందిన వ్యక్తికి గాయాలవడంతో 108 అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలాన్ని ఎస్ఐ సందీప్ సందర్శించి వివరాలను సేకరించారు.
News January 9, 2025
NZB: రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి
నిజామాబాద్ నగర శివారులో రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు రైల్వే ఎస్ఐ సాయి రెడ్డి తెలిపారు. నిజామాబాద్-జాన్కంపేట రైల్వే స్టేషన్ పరిధిలోన బుధవారం సాయంత్రం రైలు పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొట్టడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మృత దేహాన్ని పంచనామా నిమిత్తం మార్చురీకి తరలించినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు రైల్వే ఎస్ఐ సాయిరెడ్డి వివరించారు.
News January 9, 2025
NZB: రైల్వే స్టేషన్ ప్రాంతంలో వృద్ధుడు మృతి
నిజామాబాద్ వన్ టౌన్ పరిధిలో గుర్తు తెలియని వృద్ధుడి మృతదేహం లభ్యమైనట్లు SHO రఘుపతి బుధవారం తెలిపారు. రైల్వే స్టేషన్ ఎదురుగా దర్గా వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతి చెంది ఉండటంతో స్థానికులు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని పంచనామా నిమిత్తం మార్చురికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వివరించారు.