News February 26, 2025
NZB: చికిత్స పొందుతూ మహిళ మృతి

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుర్తు తెలియని మహిళ మృతి చెందినట్లు వన్ టౌన్ SHO రఘుపతి తెలిపారు. ఈ నెల 23న ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఓ మహిళ అపస్మారక స్థితిలో పడి ఉండటంతో 108 ద్వారా చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ.. బుధవారం మహిళ మృతి చెందింది. మృతురాలిని ఎవరైనా గుర్తుపడితే వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని రఘుపతి సూచించారు.
Similar News
News February 27, 2025
NZB: 17న మిస్సింగ్ 26న మృతదేహం లభ్యం

ఈ నెల 17 నుంచి అదృశ్యమైన వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు NZB 4వ టౌన్ ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. ఎస్ఐ వివరాలు.. NZB కోటగల్లీకి చెందిన కారు డ్రైవర్ శ్రీనివాస్‌రెడ్డి(48) ఈ నెల డ్రైవింగ్‌పై కుంభమేళాకు వెళ్లి 17న తిరిగి వచ్చాడు. అప్పటి నుంచి ఇంటికి వెళ్లకుండా కనిపించలేదని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. అయితే ఆయన మృతదేహం నవీపేట్ గాంధీనగర్ శివారులో లభ్యమైనట్లు ఎస్ఐ వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు.
News February 27, 2025
భీమ్‌గల్: సాంబార్‌లో పడి చిన్నారి మృతి

వేడి సాంబార్‌లో చిన్నారి పడి మృతి చెందిన విషాద ఘటన భీమ్‌గల్‌లో చోటు చేసుకుంది. ఎస్ఐ మహేశ్ ప్రకారం.. భీమ్‌గల్‌కి చెందిన కర్నె చార్వీక్(3) తన తల్లి నిహరికతో ఈ నెల 19న ముచ్కూర్‌లోని బంధువుల శుభకార్యానికి వెళ్లాడు. అక్కడ ఆడుకుంటూ ప్రమాదవశాత్తు వేడి సాంబార్ పాత్రలో పడిపోయాడు. శరీరమంతా కాలిపోగా చిన్నారిని చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలించారు. బుధవారం చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్ఐ వివరించారు.
News February 27, 2025
నందిపేట్: దుబాయిలో ఉద్యోగాల పేరిట మోసం

నందిపేట్ పోలీస్ స్టేషన్‌లో గల్ఫ్ ఏజెంట్ కస్పా శ్యామ్, మధు, సాయి రెడ్డి, గుడ్ల ప్రకాష్‌లపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. అయిలాపూర్ గ్రామానికి చెందిన ఏజెంట్ కస్పా శ్యామ్ దుబాయిలో ఉద్యోగాల పేరిట తమ నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసినట్లు బాధితుడు తెలిపారు. నలుగురు దాడి చేశారని అమలాపురానికి చెందిన బాధితుడు నరసింహమూర్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నలుగురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.