News March 18, 2024

NZB: చెరువులో భార్యాభర్తల మృతదేహాలు లభ్యం

image

నిజామాబాద్‌లోని వెంగళరావు నగర్ సమీపంలో ఉన్న బాబన్ షాబ్ చెరువులో సోమవారం రెండు మృత దేహాలు లభ్యమయ్యాయి. భార్యాభర్తల మృతదేహాలను గమనించి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అమృతపూర్ గ్రామానికి చెందిన పెద్ద బాబయ్య, పోశమ్మగా గుర్తించారు. వారు స్థానిక దర్గా వద్ద ఉంటూ బిక్షాటన చేస్తూ జీవిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News December 28, 2024

NZB: 2న జిల్లాకు ఎస్సీ వర్గీకరణ ఏకసభ్య కమిషన్‌

image

ఎస్సీ వర్గీకరణ ఏకసభ్య కమిషన్‌ జస్టిస్‌ షమీం అక్తర్‌ గురువారం(జనవరి 2న) నిజామాబాద్ జిల్లాకు రానున్నట్లు కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హనుమంతు తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని ఎస్సీ కుల సంఘాల సభ్యులు వర్గీకరణ విషయంపై దరఖాస్తులను కలెక్టరేట్‌లో సమర్పించాలని సూచించారు. దరఖాస్తు ఫారాలు షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి అధికారి కార్యాలయం నిజామాబాద్‌, ఆర్మూర్‌, బోధన్‌లలో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.

News December 28, 2024

నిజామాబాద్ పొలిటికల్ రౌండప్ @2024

image

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్, బీజేపీకి 2024లో కలిసొచ్చిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 9 స్థానాలకు 4 స్థానాలకు కైవసం చేసుకుంది. బీజేపీ 3 చోట్ల గెలుపొందిందగా బీఆర్ఎస్ 2 చోట్ల విజయం సాధించింది. కాగా జిల్లాకు చెందిన మహేశ్ కుమార్ గౌడ్‌కు పీసీసీ పదవీ వరించింది. రాజకీయంగా ఎదగడానికి బీజేపీ, బీఆర్ఎస్ తమ వంతు ప్రయత్నం చేస్తోంది. దీనిపై మీ కామెంట్

News December 28, 2024

చిట్టి పొట్టి సినిమా చూసిన ఎమ్మెల్యే ఏమన్నారంటే..?

image

బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి చిట్టి పొట్టి సినిమా ను శుక్రవారం తిలకించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సినిమాలో తోబుట్టువుల ప్రేమ అనుబంధాలు, ఎమోషన్స్ తదితర వాటిని ఎంతో అద్భుతంగా చూపించారన్నారు. ‘ఇలాంటి సినిమాలు చాల అరుదుగా వస్తాయి. ఈ జనరేషన్ ఈ మూవీని తప్పకుండా చూడాలని’ అన్నారు. సినిమా దర్శకుడు, నిర్మాతలకు అభినందించారు. ఈ సినిమా విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు.