News April 13, 2025
NZB: చేపలు పట్టేందుకు వెళ్లి బావ, బావమరిది మృతి

చేపలు పట్టేందుకు వెళ్లి ఇద్దరు మృతి చెందిన ఘటన నిజామాబాద్ జిల్లా నందిపేటలో చోటు చేసుకుంది. మాచర్లకి చెందిన షేక్ షాదుల్లా, అతని బావమరిది మహమ్మద్ రఫీక్ శుక్రవారం సిద్దాపూర్ శివారులోని వాగులో చేపలు పట్టేందుకు వెళ్లారు. షేక్ రఫిక్ కాలుజారి ప్రమాదవశాత్తు వాగులో పడ్డాడు. అతన్ని రక్షించేందుకు షాదుల్లా వాగులో దిగగా ఇద్దరు మునిగిపోయారు. మృతదేహాలను వెలికి తీసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Similar News
News April 15, 2025
గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో పవన్, బాలయ్య సినిమాలు!

నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబోలో మరో మూవీ రాబోతున్నట్లు తెలుస్తోంది. వీరి కాంబోలో వచ్చిన ‘వీరసింహారెడ్డి’ బ్లాక్ బస్టర్‌గా నిలువగా మరోసారి యాక్షన్-ప్యాక్డ్ ఎంటర్టైనర్‌తో రాబోతున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతుండగా ఈ ఏడాది చివర్లో షూటింగ్ ప్రారంభం కానుంది. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో పక్కా యాక్షన్ ఫిల్మ్ తీసేందుకు చర్చలు జరుపుతున్నారు. ఇది 2026లో స్టార్ట్ అవ్వొచ్చని టాక్.
News April 15, 2025
రాబర్ట్ వాద్రాకు మరోసారి ఈడీ నోటీసులు

కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు మనీ లాండరింగ్ కేసులో ఈడీ మరోసారి నోటీసులు పంపింది. హరియాణాలోని శిఖోపూర్ భూముల వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న ఈడీ ఈనెల 8న విచారణకు హాజరు కావాలని వాద్రాకు సమన్లు జారీ చేసింది. వాటికి ఆయన స్పందించకపోవడంతో మళ్లీ నోటీసులు పంపింది. ఆ భూముల వ్యవహారంలో వాద్రాకు చెందిన స్కైలైట్ హాస్పిటాలిటీ సంస్థ అక్రమాలకు పాల్పడిందన్న ఆరోపణలున్నాయి.
News April 15, 2025
నస్పూర్: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

నస్పూర్ మండలం దొరగారి పల్లె సమీపంలో గుర్తు తెలియని వాహనం వ్యక్తిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని వయస్సు సుమారుగా 50 ఏళ్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. నలుపు రంగు టీ షర్టు, బూడిద రంగు ప్యాంటు ధరించి ఉన్నాడని పేర్కొన్నారు. ఇతని ఆచూకీ తెలిపిన వారు సమాచారం ఇవ్వాలని కోరారు.