News March 31, 2024

NZB: చోరికి వచ్చిన వ్యక్తిని కొట్టి చంపిన స్థానికులు

image

ఓ రైస్ మిల్లులో చోరీకి వచ్చిన వ్యక్తిని స్థానికులు చితక బాధడంతో మృతి చెందిన ఘటన నిజామాబాద్‌లోని పాల్దా గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. గ్రామ పరిధిలోని మూసివేతకు గురైన శ్రీ వెంకటేశ్వర రైస్ మిల్‌లో ఓ తండాకు చెందిన 8 మంది చోరీకి యత్నించారు. గ్రామస్థులు ప్రతిఘటించడంతో ఏడుగురు పారిపోగా.. బానోతు సునీల్ వారికి దొరికాడు. దీంతో వారు అతడిని తీవ్రంగా కొట్టడంతో సునీల్ అక్కడికక్కడే మృతి చెందాడు.

Similar News

News November 6, 2024

బిక్కనూరు: చెరువులో పడి వ్యక్తి మృతి

image

చెరువులో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన బిక్కనూర్‌లో జరిగింది. పెద్దమల్లారెడ్డికి చెందిన కొట్టాల సిద్ధరాములు (66) ఈ నెల 4న చేపల వేటకు వెళ్లాడు. తిరిగి రాకపోవడంతో జాలరులు గాలింపు చేపట్టినా ప్రయోజనం లేకుండా పోయింది. కాగా బుధవారం చెరువులో మృత దేహం లభ్యమైనట్లు ఎస్ఐ సాయికుమార్ తెలిపారు. మృతుడి భార్య బాలమణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

News November 6, 2024

నిజామాబాద్: నేటితో ముగియనున్న ఓటరు నమోదు గడువు

image

ఉమ్మడి (కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్) జిల్లాల ఎమ్మెల్సీ ఓటర్ నమోదు గడువు నేటితో ముగియనుంది. అర్హులైన పట్టభద్రులు ఫారమ్-18, ఉపాధ్యాయులు ఫారమ్-19 ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా అధికారులు సూచిస్తున్నారు. జిల్లాలోని అన్ని ఆర్డీవో, తహశీల్దార్ కార్యాలయాల్లో అందజేయాలని వారన్నారు.. ఆన్‌లైన్‌లోనూ దరఖాస్తు చేసుకునేందుకు అవకాశముందని వారు పేర్కొన్నారు.

News November 6, 2024

నిజామాబాద్: నేటి నుంచి సర్వే స్టార్ట్

image

సమగ్ర కుటుంబ సర్వే నేటి నుంచి మొదలుకానుంది. దీనికి సంబంధించి నిజామాబాద్ జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేశారు. సర్వే చేయాల్సిన ఇళ్లను లిస్టింగ్ చేశారు. 1273 మంది ఆశాలు, 2182 మంది అంగన్వాడీలు, 537 మంది పీఎస్‌లు, 1837 మంది టీచర్లు ఇందులో పాల్గొనున్నారు. జిల్లాలో మొత్తం 3,245 బ్లాక్‌లు ఉండగా, 3,343 మంది ఎన్యూమరేటర్లు ఉన్నారు. 370 మంది సూపర్వైజర్లు ఇందులో పాల్గొంటారు.