News April 6, 2025
NZB: చోరీలకు పాల్పడున్న నిందితుడి అరెస్ట్

జల్సాలకు అలవాటు పడి చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని అరెస్ట్ చేసినట్లు నిజామాబాద్ ACP రాజా వెంకట్ రెడ్డి శనివారం తెలిపారు. నాందేడ్ జిల్లాకు చెందిన నాందేవ్ ఆనందరావు జిల్లాలోని పలు చోట్ల దొంగతనాలకు పాల్పడ్డాడన్నారు. గత నెల 5న మాక్లూర్ మండలం మాదాపూర్లో పరశు దేవానందం ఇంట్లో చోరీ జరిగింది. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేసి బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు.
Similar News
News April 9, 2025
నిజామాబాద్ జిల్లాలో CONGRESS VS BRS

నిజామాబాద్ జిల్లాల్లో BRS, కాంగ్రెస్ మధ్య రాజకీయం నువ్వానేనా అన్నట్లుగా సాగుతోంది. ఓ వైపు BRSనేతలు KCR వరంగల్ సభపై సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ఎప్పటికప్పుడు నిరసనలు తెలుపుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు జైబాపు.. జైభీమ్.. జైసంవిధాన్ పేరిట పాదయాత్రలు, ర్యాలీలు, సన్నబియ్యం పంపిణీతో ప్రజల్లో ఉంటూ BRSనేతలకు కౌంటర్ ఇస్తున్నారు. మీ కామెంట్?
News April 9, 2025
NZB: 29 మంది ఉద్యోగులకు పురస్కారాలు

ఆర్టీసీలో పని చేస్తున్న 29 మంది ఉద్యోగులకు త్రైమాసిక ప్రగతి చక్రం పురస్కారాలు అందజేశారు. నిజామాబాద్-1 డిపోలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో రీజినల్ మేనేజర్ టీ.జోత్స్న చేతుల మీదుగా ఈ పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ రీజినల్ మేనేజర్ మధుసూదన్, డిపో మేనేజర్లు, పర్సనల్ ఆఫీసర్, సూపర్ వైజర్లు, ఉద్యోగులు పాల్గొన్నారు.
News April 8, 2025
NZB: నిర్మాణాలు చేపట్టేలా లబ్దిదారులను ప్రోత్సహించాలి: కలెక్టర్

ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు త్వరతగతిన నిర్మాణాలు చేపట్టేలా వారిని అన్ని విధాలుగా ప్రోత్సహించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. ఇళ్ల మంజూరైన వారందరు వెంటనే నిర్మాణాలు ప్రారంభించేలా తగిన తోడ్పాటును అందించాలన్నారు. ఇప్పటికే నిర్మాణాలు ప్రారంభించిన వారు నిర్దేశిత గడువు లోగా, నిబంధనలకు అనుగుణంగా నాణ్యతతో నిర్మాణ పనులు పూర్తి చేసుకునేలా క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలన్నారు.